భార్య ఇంటికి ఆభరణం!!* (నేడు ప్రపంచ వివాహ దినోత్సవం) * భరించేది భార్య, * బ్రతుకు నిచ్చేది భార్య, * చెలిమి నిచ్చేది భార్య * చేరదీసేది భార్య * ఆకాశాన సూర్యుడు లేకపోయినా... ఇంట్లో భార్య లేకపోయినా... అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. * భర్త వంశానికి సృష్టికర్త * మొగుడి అంశానికి మూలకర్త, కొంగు తీసి ముందుకేగినా... * చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా.. తనకు లేరు ఎవరు సాటి * ఇల లో తను లేని ఇల్లు... కలలో.... ఊహకందని భావన... * బిడ్డల నాదరించి... * పెద్దల సేవలో తరించి * భర్తని మురిపించి.. మైమరపించి... * బ్రతుకు మీద ఆశలు పెంచి... * చెడు ఆలోచనలు త్రుంచి... * భ్రమరం లా ఎగురుతూ... * భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ... * కళ్ళు కాయలు కాచేలా... * భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి. జీవితాన్ని అందించే మన మనిషి ... ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం * 🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment