సరదాగా కాసేపు
ముద్దు పేర్లు తెచ్చిన తంటా
ఒక ఊరిలో ఓ భార్య భర్త వుండేవారు...అసలు పేర్లు వొదిలేస్తే ముద్దు పేర్లు. భార్య పేరు పాయసం. భర్త పేరు నెయ్యి...వాళ్ళ ఆవు పేరు చుట్టం. దూడపేరు దెయ్యం....వాళ్ళకి వూరికి కొంచెం దూరంలో పొలం ఉంది...రోజు భర్త పొలానికి పొద్దున్నే చద్దన్నం తినేసి. మధ్యాన్నం వొచ్చేవాడు ఇంటికి....ఓరోజు పొలంలో పని చేస్తున్నప్పుడు పక్కవూరి నుండి ఒక చుట్టం వొస్తూ కనిపించాడు....
ఎమోయ్ ఇటేనా రావడం. ఇంటికి వెళ్ళండి పాయసం ఉంది....ఇంట్లో నేను ఇంకో గంటలో వొస్తాను...అన్నాడు...
చుట్టం లొట్టలు వేసుకుంటూ ఇల్లు చేరాడు....ఆ ఇల్లాలు. రండి అన్నయ్య గారు. కాళ్ళు కడుక్కోండి. నెయ్యి రాగానే అన్నం ఒడ్డిస్తాను.... అండీ...
అబ్బో ఏమి మర్యాద. అనుకుంటూ తీరిగ్గ. కూచున్నాడు...ఇంతలో ఆ ఇంటాయన వొచ్చాడు.....వొస్తూనే....ఒసేయ్. ఆ చుట్టాన్ని. ( ఆవుని) కట్టేసి. దెయ్యాన్ని ( దూడని) వదులు అన్నాడు....
ఇంటికి వచ్చిన చుట్టం ఒక్కసారిగా ఖంగు తినే. ఇదేంటి పాయసం నెయ్యి అని...ఇప్పుడు నన్ను కట్టేసి దెయ్యాన్ని వదులు తా అంటున్నారు..... కొంపదీసి తెరగా వొస్తే తినే బాపతు అని తెలిసిపోయిందా ఏమో...ఎందుకయినా మంచిది ఇక్కడ నుండి జారుకుంటే మంచిది... కొంచెం బజారులో పని ఉంది చూసుకుని వొస్తా అని ఆటే పోయాడు...
వెళ్లినవాడు ఎంతకీ రాలేదు ఏమిటి చెప్మా. అని భార్య భర్త అనుకుంటూ...మన ముద్దు పేర్లు వల్ల భయపడ్డడేమో నే....చుట్టం అంటే ఆవు అని తెలీక తనని కట్టేస్తాము అనుకుని ఉంటాడు.....ఖర్మ....
సరే కానీ భోచేద్దాం పద. అంటూ ఇద్దరూ భోజనం చేసేసారు...
అదీ సంగతి ....ముద్దు పేర్లు. తో తంటా....చందమామ కధ... చిన్నప్పుడు చదివింది.....
No comments:
Post a Comment