మాది నేటితరం అభివృద్ధి చెందిన తరం .
అమ్మానాన్న కాళ్లకు మొకడానికి సిగ్గుపడే తరం.
తప్ప తాగి పోలీస్ స్టేషన్లో మోకాళ్ళ మీద గర్వంగా కూర్చునే యువతరం
మా నవతరం..
నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాం.
కట్టే బట్టని బరువుగా భావిస్తాం.
నాగరికత అంటూ వావివరసలు మర్చిపోతాం.
పొట్టి బట్టల్లో పరువుని దాచేసుకుంటాం.
ఎందుకంటే మాది నవతరం అభివృద్ధి చెందిన తరం.
అమ్మ చేతి కమ్మని వంటకు మేం దూరం.
పిజా బర్గర్లే మాకు ప్రియం.
పానీ పూరి బండి కాడ మురికి కాలువ నీరుని లొట్టలేసుకుంటూ తాగుతాం,
పరమ పవిత్రమైన భగవంతుని తీర్థాన్ని పుచ్చుకోవడానికి పదిసార్లు ఆలోచిస్తాం.
పండుగ రోజు కూడా దేవుడికి నమస్కరించడానికి సంకోచిస్తాం .
రోడ్డుమీద కనబడ్డ ప్రతివాడికి షేక్ హ్యాండ్ లిస్తాం,
లేని రోగాలను తెచ్చుకుంటాం
ఎందుకంటే మాది యువతరం, నవతరం, అభివృద్ధి చెందిన తరం.
తల్లిదండ్రులారా మీ పిల్లలు ఫ్యాషన్ కి దగ్గరవుతున్నారు అనుకుంటున్నారు కానీ సభ్యతా సంస్కారానికి సాంప్రదాయానికి దూరమవుతున్నారని గుర్తించండి
అమ్మ నాన్నలకి మొకడానికి ఆలోచించే వాడికి భవిష్యత్తులో అన్నం కూడా దొరకదని తెలిసేలా మా పిల్లల్ని పెంచండి
🙏🏾🙏🏾🙏🏾🙏🏾శుభరాత్రి🙏🏾🙏🏾🙏🏾🙏🏾
No comments:
Post a Comment