Wednesday, November 8, 2023

సరదాగా… *ఉప్పు వుంది!*

 2111.  1-6.  050323-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఆదివారం సరదాగా…

                   *ఉప్పు వుంది!*
                    ➖➖➖✍️


*రాజారామ్ కు గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు..*

*వెంటనే ఫామిలీ వాళ్ళు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు..అన్ని టెస్టులు చేయించారు..*

*"ఇప్పుడిపుడే కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతోంది, స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చెయ్యాలి, నేను చెప్పే ఈ డైట్ లో అస్సలు ‘ఉప్పు’ వాడకూడదు!" అని డాక్టర్ చాలా గట్టిగా హెచ్చరించాడు.*

*ఈ నా డైటు, మందులు వాడితే ఇక లైఫ్ లో గుండెపోటు రాదు అని బల్లగుద్ది మరీ చెప్పాడు.*

*ఇక వీళ్ళు ఇంటికి వచ్చి ఆయన చెప్పిన డైట్ చాలా కచ్చితంగా పాటిస్తున్నారు. ‘ఉప్పు’ అస్సలు వాడటం లేదు.*

*ఒక ఆరు నెలల తరువాత మళ్ళీ గుండెపోటు వచ్చింది.*

*వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి డాక్టర్ ని నిలదీశారు..*

*”మీరు చెప్పిన డైటు తూ చ తప్పకుండా పాటించాము, ‘ఉప్పు’ అస్సలు వాడటం లేదు.. అయినా ఎందుకొచ్చింది?” అని గట్టిగానే అడిగారు..*

*డాక్టర్ కు మతిపోయింది..    ‘అంత మంచి మందులు, ఆ డైటు చేస్తే మళ్ళీ వచ్చే చాన్స్  లేదు!’ ఎందుకొచ్చిందబ్బా అని తెగ ఆలోచించాడు. అయినా కారణం దొరకలేదు..*

*ఇలా కాదని అమెరికా నుండి సైటిస్తులను పిలిపించి రాజారామ్ పై పరిశోధన చేయించాడు...*

*వాళ్ళు నెలరోజుల తరువాత తేల్చి చెప్పింది ఏమిటంటే..*

*"అతను వాడే…    పేస్ట్ లో ఉప్పుంది, అందుకే అతనికి మళ్ళీ గుండెపోటు వచ్చిoది" అని.*✍️
                       -సరదాగా .. సేకరణ.

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment