Tuesday, November 7, 2023

మీలో దైవభీతి ఉన్నంతవరకు దైవం లభ్యం కాడు. పాపభీతి ఉండాలి గాని దైవభీతి ఉండకూడదు. దైవప్రీతి ఉండాలి. దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించాలి. అప్పుడే దైవం లభ్యమవుతాడు.

 210223a1538.    220223-
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀230.
నేటి... 

                  *ఆచార్య సద్బోధన*
                     ➖➖➖✍️

    *" మీ ఇంటికి ఎవరైనా కొత్త స్నేహితుడు వస్తే, “రండి, దయచేసి కూర్చోండి" అని కుర్చీ వేసి మర్యాద చేస్తారు.* 

*కానీ, పాత స్నేహితుడే గనుక వస్తే ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా, “రారా, కూర్చోరా" అని ఆహ్వానిస్తారు.* 

*ఎందుకంటే పాత స్నేహితునితో మీకు సన్నిహిత సంబంధం ఉంటుంది. త్యాగరాజుకు రామునితో అట్టి సంబంధం ఉండటంచేతనే, “రార మా ఇంటి దాకా.." అని ఎంతో స్నేహంగా, స్వేచ్ఛగా, పవిత్రంగా, ఆర్తితో పిలిచాడు.* 

*మీరు కూడా దైవాన్ని మీ పాత స్నేహితునిగా భావించి దైవంతో స్వేచ్ఛగా మెలగాలి. ఎన్నో జన్మలనుండి భగవంతుడు మీ వెంటనే వస్తున్నాడని విశ్వసించాలి. అదే నిజమైన భక్తుని లక్షణం.*
 
* మీరు భగవంతుడంటే భయం, భయంగా ఉంటే ప్రయోజనం లేదు. పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఉండాలి. ప్రేమచేత, స్వేచ్ఛచేతనే దైవాన్ని పొందడానికి వీలవుతుంది.* 

*మీలో దైవభీతి ఉన్నంతవరకు దైవం లభ్యం కాడు. పాపభీతి ఉండాలి గాని దైవభీతి ఉండకూడదు. దైవప్రీతి ఉండాలి. దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించాలి. అప్పుడే దైవం లభ్యమవుతాడు."*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

No comments:

Post a Comment