0104. 2-1. 050323-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀789.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*మానవుని జీవితమునకు ఆన్ని విధములా తగిన భద్రత కావలెనంటే భగవన్నామ స్మరణ తప్పక చేస్తూ ఉండాలి.*
*ఎంతో శ్రమపడి పండించిన పంట పశువులు మేయకుండా రైతు ముళ్ళకంచే ఏర్పాటు చేసుకొని జాగ్రత్తపడతాడు.*
*మరి ఎన్నో జన్మల పుణ్య ఫలము చేత లభించిన ఈ మానవ జన్మను సార్థకం గావించుకోవలెనంటే మనము ఇంకెంత జాగ్రత్త పడాలి!?*
*కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే పశువులు మనలోకి చొరబడి సహజముగా మనలో ఉండిన ఆధ్యాత్మిక శక్తిని తినేయకుండా ఉండాలంటే భగవన్నామము అనే దృఢమైన ముళ్ళకంచే ఏర్పాటు చేసుకోవాలి.*
*నిత్యమూ దానిని పర్యవేక్షిస్తూ ఉండాలి. అనగా నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి, భజిస్తూ ఉండాలి, సేవిస్తూ ఉండాలి.*
*అప్పుడు ఎట్టి దుర్గుణములూ మనలోకి చొరబడలేవు. సంపూర్ణమైన రక్షణతో జీవితమును ముగించి పరమాత్మను చేరుకొనుటకు మార్గం సుగమం అవుతుంది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!
No comments:
Post a Comment