*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *మన సద్గతికైనా, దుర్గతికైనా కారణం మన మనస్సే.*
💕*దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం. దీని లోపల ఉన్న ఆత్మయే దైవం.*
❤️ *మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు. మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు.*
💖*మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది.*
💕 *”భగవంతుణ్ణి చిత్రాలలో వెతకొద్దు,చిత్తములో వెతకండి”అని భగవాన్ శ్రీరమణమహర్షి అన్నారు.*
💓 *దీన్నిబట్టి ‘మనకి భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు’ అని తెలుస్తున్నది కదా!_*
💓 *కానీ మనకి కానరావడం లేదు. ఎందుకూ? మన మనస్సులో ఉన్న మాలిన్యాల వల్ల.*
❤️ *మనలో ఉన్న దేవుడు మనకు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు ! మొదటిది ‘నేను’ అనే తలంపు. ఇక రెండవది ‘నాది’ అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం ! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.*
💕 *మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుణ్ణి పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి… ఎలా ?*
❤️ *ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పనీ, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పనీ ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని మనం అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి.*
💖 *అజ్ఞానమనే నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).*
💞 *మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యాలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరు అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.*
💕 *సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు.*
💖 *శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.*
💕*మనస్సునూ బుద్ధినీ సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి.*
💞 *మన సద్గతికీ, దుర్గతికీ కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.*
💕*మనలో అనేకానేక బలహీనతలుంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలూ ఉంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.*
💕*హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా ఆయన గురించి ఆలోచించం…ఇదే కదా మాయ.*
❤️ *శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ.. ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.*
💖 *మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది !Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment