రామకృష్ణ పరమహంస దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి "భగవంతుడు ఎలా చూస్తాడు?" అని అడిగాడు. ఆయన ఏమీ మాట్లాడకుండా ఒక యాపిల్ పండును అతని చేతిలో పెట్టి ఈ పండును ఈశ్వరుడు చూడని చోటుకు వెళ్లి తినేసి రావలసింది' అని చెప్పారు. ఆ పండు తీసుకుని వెళ్ళిన శిష్యుడు మరునాడు పొద్దున్న నీరసపడిపోయిన ముఖంతో తిరిగివచ్చి భగవంతుడు చూడని ప్రదేశం నాకు కనపడలేదు, ఈ యాపిల్ పండును నేను తినలేక పోయాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన కనపడుతున్నాడు. అటువంటప్పుడు నేను ఎక్కడికి వెళ్లి తినను?” అన్నాడు. “అయితే ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని నీకు అర్థమయిందా?" అని అడిగారు పరమహంస. అర్థం అయింది అని శిష్యుడు చెప్పాడు. అపుడు పరమహంస అయితే ఇక నీకు ప్రబోధము అక్కర్లేదు. వెళ్లిరా అన్నారు.
No comments:
Post a Comment