NAGASAILAKSHMI GIDUGU:
Sreenivasa Murthy Chittamuri:
భగవాన్ రమణ మహర్షి
ఆణిముత్యాలు -05 - భగవంతుడు
భగవాన్ ఆత్మయే పరబ్రహ్మమని ఆ పరబ్రహ్మము అందరిలోను ఉన్నారని కావున క్రొత్తగా భగవంతుడు కనపడలేదని అనేవారికి తన ఆత్మను గురించి తెలుసుకుని లోన ఎల్లపుడు ఆత్మ సాక్షాత్కారించియే ఉన్నదని ఆ లోనున్న ఆత్మయే పరమాత్మ అని ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగచేసికొనుటకు నేనెవరిని ప్రశ్నించుకొని మూలానికి వెళ్ళి ఆత్మ బోధ తెలుసుకోమన్నారు . *కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు ప్రతివానిలో ఆత్మ రూపములోనే ఉన్నాడని సర్వం బ్రహ్మయేయని చెప్పారు* . అయితే ఒక భక్తుడు భగవానుని ఇట్లు ప్రశ్నించాడు , స్వామీ ! ఈ అరుణాచలమనే కొండనే భగవంతుడని నిర్దేశిస్తున్నారు కదా మరి అన్నీ ఆత్మయే పరమాత్మయని మీరు చెప్పి బాహ్యముగా భగవంతుణ్ణి అరుణాచలమనే కొండ రూపమున చూపుతున్నారు కదా ! అని అనగా , భగవాన్ దానికి జవాబు ఇట్లు చెప్పినారు . “* నీవేమో ఆత్మ నీ శరీరానికి అభిన్నమని భావించవచ్చు కాని ఆత్మ అరుణాచలానికి అభిన్నమని భక్తులు భావించకూడదా ?* " అని చక్కటి జవాబు చెప్పారు మన భగవాన్ . ఆ భక్తుడు అంతటితో ఊరుకోక అరుణాచలమే ఆత్మ అయితే ఎన్నో కొండలు ఉండగా అరుణాచలకొండనే ప్రత్యేకించి చెప్పటము దేనికని భగవంతుడు అంతట ఉన్నాడు కదా ఆయనని అరుణాచలమని మీరు ఎందుకు నిర్దేశిస్తున్నారు ? దానికి భగవాన్ ఒక గొప్ప రహస్యాన్ని బైట పెట్టారు . *ఆ ప్రశ్న వేసిన భక్తునితో భగవాన్ ఈ విధముగా అడిగారు . “ నీవు అలహాబాదు నుంచి ఇక్కడికి నిన్ను ఆకర్షించినదేమిటి ? అలాగే ఇక్కడ ఉన్న వారందరిని ఆకర్షించినదేమిటి ? " అని మహర్షి అతని నడుగగా అతడు దానికి జవాబు “ మమ్ములను ఆకర్షించబడినది మీరే ( భగవాన్ ) దానికి భగవాన్ ఇట్లన్నారు . నేను ఎట్లా ఆకర్షింపబడినాను ? అరుణాచలం వలనే కావున శక్తిని కాదనేందుకు వీల్లేదు . అయితే అరుణాచలం లోపలే ఉన్నది గాని వెలుపల లేదు *. ”
తనకి మటుకు తనకు ఆకారము ఉన్నదని భావిస్తూ ఉంటే కనిపించే జగత్తు మరియు భగవంతుడు కూడా ఆకారము కలిగి ఉన్నట్లే అనిపిస్తుంది. *నిజానికి బ్రహ్మమును చూచేందుకు తెలుసుకునేందుకు వీలులేనటువంటిది ఆది ద్రష్ట, దర్శనము మరియు దృశ్యమునకు అతీతమైనది.* భగవాన్ చెప్పినదేమనగా ఎప్పుడైతే నీవొక వ్యక్తివని నీకు వెలుపలగా ఈ విశ్వమున్నదని వీటి కతీతముగా భగవంతుడున్నాడని అనుకోవడం వలన నీలో భిన్నత్వ భావనము కలుగుతుందని సూచించారు. కావున ఆ భిన్నత్వ భావము పోవాలని భోదించారు.
భగవాన్ చెప్పినది *భగవంతుడనేవాడు నీకంటే మరియు కనిపించే విశ్వాని కంటే వేరుగా లేడని దానికి ప్రమాణముగా భగవాన్ భగవద్గీతలోని శ్లోకం కూడా చెప్పి నిర్ధారించారు *. ఆ శ్లోకములో అర్ధం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో ఈ విధంగా చెప్పెను.
“ *ఓ గుడాకేశా ! నేను సర్వభూతముల హృదయంలోను ఉన్నాను. నేనే ఆది, మధ్యాన్ని, అంతాన్ని. కావున భగవాన్ నిరూపించినదేమనగా భగవంతుడు అతీతముగా ఎక్కడో ఉన్నాడని భావన్ని తొలగించమని ఆ పరమాత్మ అందరి హృదయాల్లో ఆత్మగా వెలుగుచున్నాడని అతడే అందరికి మూలమని అందరూ అ పరమాత్మలో ఉన్నారని ఆ పరమాత్మ వేరుగా లేడని చెప్పారు.* ఆ పరమాత్మ ఎల్లరి హృదయాలలో సాక్షాత్కారించే ఉన్నారని అయితే ఆ రహస్యాన్ని తెలిసికొనలేని మనము బ్రహ్మాన్ని ఎక్కడో వెతుకుతూ అన్వేషణ కొనసాగిస్తున్నాము కావున *బ్రహ్మము కంటే ఆత్మ అనేది వేరుగా లేదు.* ఈ సత్యాన్ని తెలిసికొనకపోవడం గల కారణం నేను శరీరమనే భావనే. ఆజ్ఞానములో మునిగి ఉండటం వలన ఎప్పుడైతే నేనోక దేహాన్ని అని అనుకున్నామో ఇక ఎన్నో ఆటంకాలు మాయ రూపేణ వచ్చి అడ్డుతెరను కట్టి వేస్తుంది. విషయాలపై వినోదాలపై వస్తువులపై వ్యామోహము కలిగి వాంఛల చేత భగవంతుడు ఎక్కడో బాహ్యముగా ఒక శరీర రూపముగా ఉన్నాడనే భ్రమ కలిగి తన కోరికలు నెరవేర్చుటకై కనబడని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ , కాలాన్ని వృధా చేసుకుంటూ లోనున్న దైవాన్ని మరచి తనకు అడ్డుగా ఉన్న మాయ తెరను తొలగించుకొనుటకు యత్నించక సంసారమనే సముద్రములో కొట్టుమిట్టాడుతూ జననమరణమనే చక్రములో ఇరుక్కుని పుడుతూ మరణిస్తూ ఇలా ఎన్నో జన్మలెత్తుతూ అనుభవిస్తూనే ఉంటాడు. కాని ఎప్పటికో ఒకప్పుడు సత్యాన్ని తెలుసుకుంటాడు
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జటారే శయనం
ఇహ సంసారే భహు దుస్తారే
కృపయా దేవ పాహి మురారే
. భగవాన్ వద్ద మరియొక భక్తుడు భగవంతుని గూర్చి ప్రస్తావన తెచ్చారు . అతను భగవానుని " భగవంతుడు ఒక వ్యక్తా ? ” *అని ప్రశ్నించాడు దానికి భగవాన్ “ అన్నివేళల్లో నీకు అపరోక్షంగా ఉండునట్టి “ నేను ' ఆయనే కాని నీవు బాహ్యముగా కనిపించే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన నీలో ఉన్న భగవంతుడు మరుగున పడిపోయి కన్పించకుండా ఉన్నాడు. కావున మిగిలిన వన్నిటిని వదిలి వేస్తే నేనుగా నీలో ఉండి పోతాడు.* " అని భగవాన్ భోదించారు.
భగవాన్ చెప్పినదేమనగా భగవంతుడు ఆ భగవంతుని పూజించే భక్తుడు ఆ భగవంతుని ఆర్చించే స్తోత్రాలు కూడా అన్నీ ఆత్మే అని కూడా చెప్పారు. మనిషి తనలోని ఉన్న భగవంతుడిని తెల్సుకోలేక పోవడానికి గల కారణము ఆ మనిషి యొక్క చంచలమైన మనస్సే.
ఆటువంటి వక్రమైన మనస్సును లేదా మరి ఎ ఇతర అవరోధాలు రాకుండా ఉండటానికి భగవాన్ ఆ భగవంతుడిని శరణు పొందమని చెప్పారు. విశ్వాసము ముఖ్యమని కూడా భగవాన్ చెప్పారు.
కొందరు భక్తులు భగవానుని ఈ విధమైన ప్రశ్న వేశారు . “ భగవాన్ నేను శరణాగతి చేసి ఉన్నా దేవుడు సహాయము చేయుటలేదు. " దానికి భగవాన్ చెప్పిన సమాధానము “ *నీవు ఒకసారి శరణాగతుడవైతే దైవేచ్చను అంగీకరించవలెను. నీకు ప్రియమైనది జరుగకపోతే దానికి దుఃఖించకూడదు. ఆపద మనుష్యులను భగవత్ విశ్వాసము వైపుకు తీసుకుని వెళ్ళును *. ” అని అన్నారు . భగవాన్ భక్తునికి ఇట్లు చెప్పెను. " ఒకసారి శరణాగతి తాను ( భగవంతుడు ) కనిపించినా , కనిపించుకున్నా అయన ఇచ్చను స్వీకరించవలెను. దైవమునకు తోచినట్లు చేయనీ . *నీ ఇష్టానుసారముగా ప్రకారము జరగాలి అని కోరుకోవటం శరణాగతి కాదు. అది దైవముపై ఆదిపత్యమే అవుతుంది ఏదిమంచో ఆయనకే తెలుసు . ఎప్పుడు ఏవిధముగా జరిపించవలేనో ఆయనకే తెలుసు . శరణాగతి అయిన వారు పూర్తిగా ఆయనకే వదిలిపెట్టలి* . " భగవాన్ ఇంకొక గొప్ప విషయం చెప్పారు . " సాధారణముగా భక్తుడు దైవాన్ని ప్రార్ధించి *నీ ఇచ్చయే నెరవేరుగాక అని అంటూ ముగిస్తాడు . అయితే దైవము ఇచ్చ నెరవేరేందుకు వీళ్ళ ప్రార్ధన లెందుకు ? కావున అన్ని వేళల్లో , అన్ని పరిస్థితులలోను , భగవంతుడు తలచిన ప్రకారము నెరవేరును. కావునమనుష్యులు ఎవరి ఇష్టానుసారము వారు ప్రవర్తించిన వారు అనుకొన్నట్లు జరుగదు . ప్రతివారు ఆ భగవంతుడిచే కాపాడుబడుచున్నారు *. నీకు కావలసినవేవో దైవానికి ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు . ఆయనకు అన్నీ తెలుసు . ఆయనే వాటిని చూసుకుంటారు . " భగవాన్ చెప్పిన పై బోధ ప్రతి సాధకుడు గట్టి విశ్వాసముతో నమ్ముకుని ఒక్కసారి దైవానికి శరణాగతి అయితే ఇక దేని గురించి ఆలోచించవలసిన పనిలేదు . అని తెలియబడినది . ఇంకొక భక్తుడు భగవానుని “ మాప్రార్ధనలు మన్నించబడతాయా అని అడుగగా భగవాన్ దానికి జవాబుగా తప్పక మన్నించబడతాయని మరియు ప్రతి సంకల్పము వృధా కాదని చెప్పారు . కావున భగవాన్ చెప్పిన బోధనలను పాటించి భగవంతుడు ఎక్కడో బైట ఉన్నాడని భావాన్ని వదిలి భగవంతుని కోసం బైట వెతుకుతూ కాలాన్ని వృధా చేయక మనస్సును నిలకడ చేసి అంతర్ముఖం కావించిన ప్రతి జీవిలో మహాతేజస్సుతో ప్రజ్వలించుచున్న ఆత్మ ప్రతి జీవిలో సాక్షాత్కారించే ఉన్నదని గ్రహించి ఆ ఆత్మయే పరమాత్మ అని తెలుసుకొనవలెను . సాధకుడు మొదట దైవాన్ని సాకారరూపములోనే పూజించుట సహజము . తన భక్తి పరిపక్వమైనపుడు క్రమేపి లోనున్న ఆత్మయే పరమాత్మ అని గ్రహిస్తాడు . నిరాకారా రూపములో నున్న ఆత్మయే దైవమని తెలిసికుంటాడు . ఇంతటి రహస్యాన్ని తెలుసుకోవటానికి అనుభూతి పొందటానికి మనమందరము భగవాన్ శ్రీ రమణ మహర్షిని శరణువేడుదాం. భగవాన్ నీవే మాకు శరణాగతి .
No comments:
Post a Comment