సంక్రాంతి కితకితలు
మా చిన్న తనం లో, 6/7 (1962s)తరగతి చదివే రోజుల్లో సంక్రాంతి ముందు రోజుల్లో ఇంట్లో పండుగ హడావుడి గా ఉండేది. ఇంట్లో అందరికీ బట్టలు కొనటం.వాటిని.కుట్టించటం, మేమైతే tailors చుట్టూ తిరిగే వాళ్ళం. ఈ హడవిడి కి తోడు ప్రొద్దున లేవగానే మా ఇంటి ప్రక్క ఖాళీ స్థలంలో రెండు, మూడు ఎడ్ల బండ్లతో మా పంట భూముల్లో పండిన వడ్లు/ ధాన్యం కౌలు క్రింద ప్రోద్దున్నే రైతులు తీసుకొచ్చే వారు. వాళ్ల భోజనాలకి ఏర్పాట్లతో ఇంట్లో ఇంకొంచం హడావుడి గా ఉండేది.
మా ఇల్లు 600 గజాల్లో డాబా ఇల్లు వుండేది. మధ్య గదిలో నేల మాళిగ ఉండేది.
వీళ్ళు వచ్చే ముందే మా చేత శుభ్రం చేయించే వారు.
రైతులు తెచ్చిన వడ్లు/ధ్యానం 30/40 బస్తాలు ఈ నేలమాళిగలో పోసి, రైతులు ఊళ్ళో సరదాగా తిరిగి కావాల్సినవి కొనుక్కుని వీలైతే సినిమా కూడా చూసి వెళ్ళేవారు.
ఇప్పటి నించి మాకు అసలు పని మొదలు అయ్యేది.
ఇక ప్రతి మూడు నాలు గు వారాలకీ, మేము నేల మాళిగ లో కి nickers తో దిగి ముప్పయి మానికలు వడ్లు( మానిక అంటే 2 Kgs) బస్తా లో కి తీసి మర పట్టించుకుని రావటం.
నేల మాళిగలోకి దిగంగానే చిన్న చిన్న ధాన్యం రెక్కల పురుగులు/ చిలకలు కుట్టేవి
వీలైతే సైకిల్ మీద నో లేక రిక్షా మీదనో బియ్యం తీసు కెళ్ళి మరపట్టించటం. ఈ కార్యక్రం అంత ఆదివారం నాడు పెట్టేవారు. ఆదివారం అయినందు వలన అక్కడ మాలాంటి పక్షులు చాలా మంది బియ్యం, గోధుమలు మిర్చి, పసుపు కొమ్ములు ఆడించేoదుకు ఉండేవారు.
అక్కడ ఒక motor కు మూడు నాలుగు మరలు ఉండేవి. పిండికీ, కారానికీ, పసుపుకుకూ బియ్యానికీ.
వెళ్ళగానే మా వడ్లు మూటలు లోపల లైన్లో పెట్టీ, బయట మెట్లమీద కూర్చోమనే వాడు. లోపల పరిస్థితి భయకరంగా ఉండేది. మట్టి రోడ్డు మీద లారీ నో, బస్సో వెళితే ఎంత దుమ్ము లేస్తుందో అంత ఉండేది. లోపల గాలి లోకి ఎగిరిన పిండి, కారం పసుపు, తవుడు. ఈస్ట్ మన్ కలర్ లో ఉండేది. మా వంతు రాగానే పిలిచే వాడు.
ఎన్ని మానికలు అని అడిగేవాడు. మేము చిన్నతనం చేష్ట తో కొంచెం తక్కువ చెప్పవాళ్ళం
నాలుగు డబ్బులు మిగులుతాయి అని. వాడు మూట ఎత్తగానే కనిపెట్టి తక్కువ చెప్పావు అబ్బయ్యా అనేవాడు.
కొలత ని బరువుతో settle చేసేవాడు.
చివర్లో హమాలీ మామూలు కింద ఒక దోసెడు బియ్యం లాగేవాడు. వాడు బియ్యం కొట్టేస్తాడు మీరు లోపల దగ్గర ఉండమని ఇంట్లో instructions ఇచ్చే వాళ్ళు. ఒక అరగంట అన్నా లోపల ఉండాల్సి వచ్చేది.
జుట్టు, వళ్లు, బట్టలు రక రకాల రంగుల్లో తయ్యారు అయ్యేవి. దసరా వేషగాళ్ళ లాగా తయారు అయ్యే వాళ్ళం.
బతుకు జీవుడా అనుకొని ఇంటికి వచ్చే వాళ్ళం. నుయ్యి దగ్గర మా మీద పడ్డ పిండి అంతా వదిలించుకునేందుకు సగం నుయ్యి నీళ్ళు అయిపోయేవి.
మా అదృష్టం బాగుంటే సినిమా కి డబ్బులు ఇచ్చేవారు. మా brothers అందరం ఉత్సాహంగా కత్తి కాంతారావు సినిమాకి వెళ్ళేవాళ్ళం. పడిన కష్టమంత మరచి పోయే వాళ్ళం.
బియ్యం తో బాటు నూకలు వచ్చేవి. అవి సెపరేట్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో మిక్సి లు , grinders, దోశ పిండి వేసేందుకు ఉండేవి కాదు. ఇందువలన మాకు 10 రోజులకు ఒకసారి అయిన నూకల అన్నం పెట్టేవారు.
ఇంట్లో ఏపని చెప్పినా ఉత్సాహంగా చేసేవాళ్ళం. ఎందుకంటే చివరలో చిన్న చిన్న టిప్స్ ఇచ్చేవాళ్ళు.
కిరాణా షాపు కి నెలసరి సరుకులకు వెళ్ళినప్పుడు,. వాడిని తొందర పెట్టకుండా చిన్న బెల్లం ముక్క కానుక ఇచ్చి ఒక చోట కూర్చో మనేవాడు. మేము కూడ తొందర పెట్ట కుండా ఎప్పుడు కట్టి ఇస్తే అప్పుడు తీసుకుని వచ్చే వాళ్ళం.
పండగ కి ఇంట్లో చుట్టాలంతా వచ్చేవారు.ఏదన్నా పని అప్పచెప్తే పిల్లలందరం
పొలో మని చేసేసేవాళ్ళం.
పెద్దవాళ్లు వాళ్ళ ముచ్చట్ల లో ఉండేవారు
ఆడపిల్లలు గాజులు రిబ్బన్లు ముగ్గుల హడావిడి లో ఉండేవారు
చివరికి పండగ ముగిసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లాక గడిపిన మధుర క్షణాలు తలుచుకుంటూ పెద్దవాళ్ళు ఉత్తరాలు రాసుకొనేవాళ్ళు
💐💐💐💐💐💐
No comments:
Post a Comment