మామిడి పండు మాయాసారం
రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే *"వ్యామోహం"* అని అంటారు.😛
మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే *"వాత్సల్యం"* అని విశదీకరించారు😛.
చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే *"ఆప్యాయత"* అని చాటి చెప్పారు.😛
పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే *"లోభం"* అని అన్నారు.😛
మన పండంతా తిని ఆస్వాదించాక, టెంక విసిరేసి , చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే *"అసూయ"* అని వివరించారు.😛
మామిడిపండు చేతికి చిక్కాక , ఆబగా చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో , గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, *"క్రోధం"* అని వివరంగా తెలిపారు.😛
మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే *"అహంకారం"* అని చాటారు.😛
మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని , దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే *"మమకారం"* అని తెలిపారు.😛
అతిగా మామిడి పళ్ళు తిని , జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా *"ఆత్రం"* అని విశదీకరించారు.😛
*ఒక పండు ఆరగింపు ముద్దు,*
*రెండు కద్దు*
*మూడు అసలే వద్దు,*
*ఉండాలి దేనికయినా సరిహద్దు.*
దీనినే *స్వీయ నియంత్రణ* అని విపులీకరించారు మన పెద్దలు.😛
*ఇదీ మామిడిపండు రసలీలాసారం*..😄😄
(ఎవరు దీన్ని జనాల మీదికి వదిలారో తెలియదు!)
No comments:
Post a Comment