*దేవుడున్నాడు - దేవుడున్నాడు*
ఎందరికో వారి వారి అవసరానుగుణంగా వేరువేరు సందర్భాలలో 'దేవుడున్నాడు' అనే భావం కలుగుతుంది...
అది వారి జీవిత పధాన్ని మార్చి వేస్తుంది...
దేనికయినా సమయం రావాలి...
వాల్మీకి, తులసీదాసు, పురందర దాసు, మున్నగు మహా భక్తుల గాధలన్నీ ఇటువంటివే కదా!
*ఒక చిన్న కథ ఇలాంటిదొకటి చూద్దాం...*
ఒక పెద్ద గజ దొంగ ఉండేవాడు, ఎవరింటి లోనైనా కన్నమువేసి దోచుకోవడంలో మహా నేర్పరి...
ఆ దొంగ ఒక నాటి రాత్రి తన పన్నెండు సంవత్సరాల కొడుకు తో కలసి దొంగతనానికి బయలుదేరాడు,
ఆ దొంగతనంలో ఉన్నటువంటి మెళుకువలు అన్నీ కొడుక్కి నేర్పుతూ వస్తుండగా,
అతనిదృష్టికి ఒక పెద్ద భవంతి వైపు మళ్ళింది...
బహుశా యేదో వేడుక జరుగుతోంది కాబోలు, ఆ భవనం దీపాలతో అలంకరింపబడి ఉంది.
ఆ భవంతిని చూపిస్తూ, దొంగ ( తండ్రి ) గర్వంగా ఇలా అన్నాడు.
*"చూడరా!ఆ భవనాన్ని, మూడుసార్లు కన్నమువేసి, మొత్తం దోచుకున్నాను."*ఆదిత్యయోగీ*
కొడుకు ఒక నిముషం ఆ భవనం వైపు, తండ్రి వైపు మార్చి మార్చి అయోమయంగా చూసి, తన సందేహం ప్రకటించాడు....
*"నాన్నా, నువ్వు మూడుసార్లు మొత్తం దోచుకున్నా, వాళ్ళు అలాగే సుఖ సంపదలతో, హాయిగా, ఆనందంగా ఉన్నారు. మరి మనమెందుకు ఇంకా ఇలాగే ఉన్నాము. "?*
తండ్రి కి నోటిమాట రాలేదు, నడుస్తున్నవాడల్లా ఒక్కసారి ఆగి పోయాడు, ఆకాశము వంక చూశాడు..
బహుశా అతనిలో అణగారిన జ్యోతి యేదో వెలిగింది.
పై వంక చూస్తూ అన్నాడు...
*" దేవుడున్నాడు రా, దేవుడున్నాడు. "*
ఆ క్షణమే అతని జీవితాన్ని మలుపు తిప్పింది.
కొడుకు వేసిన ప్రశ్న అతణ్ణి అంతర్ముఖుణ్ణి చేసింది, గజ దొంగ ను పరమ భక్తునిగా మార్చి వేసింది...
.
దేవుడు ఉన్నాడు
. ఉన్నాడా ? ...
. లేడు ...
. లేడా ? ...
ఈ డోలాయమాన స్థితి
మనిషికి స్థిరత్వమివ్వదు !
దేవుడు లేడు అనే కంటే
ఉంటే ఏం చేయాలి ..
ఆ కృప ఎలా పొందాలి ...
అది నాకు సాధ్యమేనా ...
అనుకొని ఎంతో నమ్మినవారు
ఎందరో ఉన్నారు
సాధనలో వారు ముందున్మారు
. ఇవన్నీ కాదు
పుట్టిన ప్రతి జీవి గిట్టడం ఎంత సత్యమో
అతడితో పాటు అతడి లోపల బయట
భగవంతుడు ఉన్నాడన్నది అంతే సత్యం
వేల సంవత్సరాలు చీకటి నిండిన గదిలోనూ
చిరుదీపం వల్ల అంతటా వెలుగు నిండుతుంది
అలాగే మానవుడు దేవుడి పట్ల కలిగించుకుని
వెలిగించుకునే చిన్నపాటి నమ్మకమే
అతడి జీవితంలో గాడాందకారాన్ని
పటాపంచలు చేస్తుంది ..
వెలుగు లక్షణం ....
లక్ష్యం చీకటి పారదోలడం ..
మనిషి జీవితంలో
నమ్మకాన్ని వెలిగించుకుంటే ..
భక్తి సాధన గమనం గమ్యం
ఆయనే చూసుకుంటాడు ..
భగవంతుడు ఉన్నాడని
నమ్మడమంత భద్రమైన జీవితం
మరెక్కడా లేదు ..
నిన్ను నమ్ము కున్నానని
ఆయనకు హామి ఇవ్వనక్కరలేదు
ఒట్టు పెట్టి మరి చెప్పనక్కరలేదు
ఒక చెంబడు నీళ్ళు ఆయనపై పోయాలనే
ఆ భావం మనసులో ఉదయిస్తే చాలు
పువ్వును అనుసరించే పరిమళంలా
భగవంతుడి అనుగ్రహా ప్రకాశం
భక్తుడి నమ్మకాన్ని వెన్నెంటి వస్తుంది ...
.
శరీరంలోని వివిధ ఆకార, అవయవాల క్రియాధర్మంతో, సజీవ శరీరం జీవితాధారంగా వుంది. అలాగే నిరాకార మనసు.
మనసు, జ్ఞానం, బుద్ధి, తెలివి, చిత్తం ఆకార బ్రెయిన్ స్పందనగా, స్థావరంగా, జీవిత తయారీకి సహకరిస్తున్నాయి. అదేవిధంగా, శరీర అంతర్గత నాడీ చలన స్పర్శ, అంతరాత్మ గా, అంతఃకరణం గా, ఆత్మగా ఆధ్యాత్మిక భావనలకు కారణమవుతున్నాయి. అయితే, " ఆకార సంబంధ నిరాకారత, భౌతిక జీవన, జీవిత నిర్వహణకు, ఆత్మ నిరాకారత, ఆధ్యాత్మిక
సాధన జ్ఞాన వృద్ధికి కారకాలుగా వుంటున్నాయి అని అంటున్నారు గురువుగారు.
* అయితే జీవన జీవితానికి సంబంధించి, దాని కర్త, మనిషి
వునికి, పరిశీలనాంశముగా, తత్సంభంద, దృశ్యత అదృశ్యతగ అవగాహన అవసరం.
అండం, పిండం తరువాత శిశు జననం, జీవన క్రమం - జీవిత గమనం ,వ్యక్తి - సమాజం.
అవసరం, అనిపించడం, ఆలోచన, ఆచరణ, దాని ఫలితం అనుభవం, పునః జీవనం, ఇదే జీవితం. అనిపించే దానిని మనసుగా భావిస్తే, ఆ తరువాత అందుకు తగిన ఆలోచనా
మనసుదే. శరీర ఆచరణా, మనసు ప్రోత్సాహమే అని అంటున్నారు గురువుగారు. * వయసు క్రమంలో, దాని అవసరాలు, ఆలోచనలు మారుతూ వుంటాయి. కనుక, దానితో
పాటే మనసు స్వరూప లక్షణాలు, స్వభావాలు క్రమ క్రమంగా
మార్పు చెందుతూ వుంటాయి. విషయ జ్ఞానం సేకరణ, ఇందుకు
సహకారిగా వుంది. తెలియడం మనసుకే కనుక, జ్ఞానం - మనసు సేకరణే . వయసు క్రమంలో, ఆలోచనకు, యోచన విచక్షణ, జ్ఞానాన్ని అనుసరించే వుంటాయి. కనుక, తెలివి, బుద్ధి
జ్ఞానాన్ని అనుసరించే వుంటాయి. మనసు ' స్థాయి ' వాటితో పాటే. నిజానికి, మనసు జ్ఞాన శేఖర స్థాయే, తెలివి, బుద్ధిగా
సందర్భానుసారం , క్రియారూపంలో, జీవిత నిర్వహణ సాగి పోతూ వుంటుంది. వ్యక్తి జ్ఞానమే వ్యక్తిత్వ స్థిరత అని అంటున్నారు గురువుగారు.
ఉపయోగ, వినియోగ గుణం, స్వభావం పదార్ధత సహజత..ఆదిత్యయోగీ..
భిన్నరీతిలో, దాని వ్యక్తత. సాధారణంగా సహజత, మూలంలో
మార్పుకు అవకాశం తక్కువ. దీనినే జీవులలో స్వభావం, మనస్తత్వంగా భావించబడుతోంది. మార్పు లేని దీనినే ' చిత్తం ',
వ్యక్తి తత్వంగా అనుకోవచ్చు. అయితే బాహ్యతతో ప్రారంభమైన, సాధారణ ఇంద్రియ మనసు జ్ఞాన ప్రభావంతో,
వివిధ స్థాయిలుగా వినియోగ పడుతుంది. అందుకే, మనసు, తెలివి , జ్ఞానం, బుద్ధి, భిన్న విధాలుగా వ్యక్తిత్వ, తత్వంగా, చిత్తం ( will ), క్రియా విధానంలో వుంటుంది. అయితే చిత్త
చంచలం, దాని అసలు మార్పు కాదు...
“సంపూర్ణంగా జీవిస్తే, మీరు ఎంతో కర్మని కరిగించేస్తారు. సంపూర్ణంగా జీవించడం అంటే ఎదురయ్యే ప్రతిదాన్ని సంపూర్ణంగా ఇంకా తీక్షణంగా అనుభూతి చెందడం...
..
*1 . ఆత్మ .... స్వయం ప్రకాశం*
*2 . నిద్ర ..... మొదటి తలుపు*
*3 . మహత్ ..తత్వం ... తొలి మెట్టు*
*4 . అజ్ఞానం లేక కారణ శరీరం..... లోపల గోడ*
*5 . అహంకారం ..... అద్దం*
*6 . ఐదు జ్ఞానేంద్రియాలు ..... కిటికీలు*
*7 . లోపల గది ..... గాడ నిద్ర లో .....కారణ శరీర వికాసం*
*8 . మధ్యమ గది ...... స్వప్న అవస్థ లో .....సూక్ష్మ శరీర వికాసం*
*9 . వెలుపల ఆవరణ ..... జాగ్రత్ అవస్త .... స్థూల శరీర వికాసం...
.
సాధనయే రహస్య తాళం చెవి
*సాధన అనేది పాక్షికమైన విశ్వం నుండి ఇంద్రియాలను దూరం చేయడం మరియు ఆత్మ మీద మనస్సు యొక్క ఏకాగ్రత. ఇది శాశ్వతత్వంలోని జీవితం లేదా ఆత్మలో శాశ్వతమైన జీవితం అందిస్తుంది. అది మనిషిని దైవత్వంలోకి మారుస్తుంది. ఇది నిరుపేదలకు ఆశను, అణగారిన వారికి ఆనందం, బలహీనులకు బలం మరియు అజ్ఞానులకు జ్ఞానాన్ని అందిస్తుంది. సాధన అనేది బాహ్య ఆనందం మరియు లోతైన స్థిరమైన శాంతి యొక్క రంగాలను తెరవడానికి రహస్య తాళం చెవి..
ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం అంటే భగవంతునికి చేరువ కావడానికి ప్రయత్నించడం కాదు - మీరు భగవంతునిలో ఐఖ్యం అయ్యేందుకు చూస్తున్నారని......*
.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
.
No comments:
Post a Comment