మనలో అహంకారం* *నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు. నేను, నాది, నా అనే అర్థాలకు వాడు,* *వాడిది, వాడే అనే భావాన్ని జోప్పించాలి. భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి. ‘సత్య నిష్ఠయే ఈ* *కలియుగానికి తరుణోపాయం’ అని శ్రీరామకృష్ణులు* శెలవిచ్చారు. సత్యం అన్నది సత్ కు* *సంబంధించినటువంటిది. సత్ పరబ్రహ్మ వస్తువు. సత్ యే ఆనందం. ఆనందమే బ్రహ్మం.
ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి* *కాలి బాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడిన* *కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తూ ఒక పాడుబడిన బావిలో పడ్డాడు.* *అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టుకొమ్మను పట్టుకు వ్రేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వ్రేలాడుతూ* *ఉండిపోయాడు. ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండ* *రాళ్ళు కనపడ్డాయి. వాటిని చూసి, ‘ఆహా! ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి* *చచ్చిపోయి ఉండేవాణ్ణి’ అని అనుకోని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశాడు.*
*ఆపదనుండి బయట పడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ* *రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్ళనూ వాళ్ళనూ పిలిచి ప్రయోజనం* *ఏమిటి భగవంతుణ్ణే పిలుస్తాను అని అనుకొని పిలవడం మొదలెట్టాడు, అంతలో ఒక* *వ్యక్తి వచ్చి నేను భగవంతుణ్ణి నీవు పిలిచావు కాబట్టి వచ్చాను’ అన్నాడు.*
*‘అవును, నువ్వు నిజంగా భగవంతుడివే! ఆలస్యం* *చేయక నన్ను పైకి లాగి కాపాడు’ అని బావిలోకి వ్యక్తి వేడుకున్నాడు. ‘నిన్ను కాపాడడానికి వచ్చాను.* *అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అన్నాడు. ‘* *అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు’ అన్నాడు లోపలి వ్యక్తి.*
*నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా?’*
*దానికి బదులుగా బావిలోని వ్యక్తి, ‘విశ్వసిస్తున్నాను, నీవు* *నిజంగా భగవంతుడివే’ అన్నాడు.*
*‘నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా?”*
*‘నమ్ముతున్నాను’ అన్నాడు.*
*‘నేను ఏది చెప్పినా చేస్తావా?”*
*‘కచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను’ అన్నాడు.*
*‘అలా అయితే నేను చెప్పినట్లు* *నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో, దాన్ని వదిలేయి. నేను నిన్ను కాపాడతాను’ అన్నాడు భగవంతుడు*
*బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి, ఆయన చేతిలో ఏవిధమైన తాడు కానీ, నిచ్చిన* *కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు. కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట* *అటుంచి, ముందు కిందనున్న బండరాళ్ళ మీద పది, తల పగిలి చస్తానని అనుకున్నాడు.*
*‘ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప, నువ్వు ఏం చెప్పినా చేస్తాను’* *అన్నాడు బావిలోని వ్యక్తి.*
*‘నువ్వు ఏమీ చేయనక్కరలేదు.* *కొమ్మను వదిలితే చాలు’ అన్నాడు భగవంతుడు.*
*సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారమనే కొమ్మను* *పట్టుకొని వ్రేలాడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని* *వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు. కాబట్టి, మనమందరం అహంకార శూన్యులుగా మారాలి..!
No comments:
Post a Comment