మాయాదేవి, శుధ్ధోధనుల కుమారుడు, సిధ్ధార్ధుడు...
అతడు పుట్టిన ఏడవ దినమే తల్లి మరణించింది...
శుధ్ధోధనుని రెండవ భార్య ఐన గౌతమి, అల్లారు ముద్దు గా పెంచింది కనుకనే, గౌతముడు అని పేరు కూడా సార్ధకమైంది!!...
_బుద్ధి ని, విచారణ ను పెంచుకున్నాడు కనుక బుధ్ధుడైనాడు._
ముసలితనము, వ్యాధి, మరణము, వీనిని అధిగమించాలని, తీవ్రమైన వైరాగ్యముతో, భార్యను పుత్రుని, రాజభవనము వదిలి, తత్వాన్వేషణ కోసం, అరణ్యములో తపస్సు చేశాడు...
_అంతటి వైరాగ్యం కలగాలంటే భగవంతుని అనుగ్రహం కావాలి_...
అందువల్ల రాగమును జయించి, విరాగి కాగలిగాడు, జ్ఞాని అయ్యాడు, పవిత్రమైన దృశ్యములనే చూడాలి.
మంచి సంకల్పమును కలిగియుండి, పరులను మాటలతో బాధించని మంచి వాక్కు కలిగియుండి మంచి కర్మలను ఆచరించాలి, అని బోధిం చాడు.
మానవతా గుణములు, శాంతి, ప్రేమ, అహింస, సత్యము,లను పెంచుకోవడమే సాధనగా చేయాలని, తాను ఆచరిస్తూ అందరికీ బోధించాడు.
తరువాతనే సమాధి, అనగా సమమైన బుద్ధి కలుగుతుంది అని అర్థం...
బుద్ధుడు ప్రాకృత సంబంధమైన యజ్ఞ యాగాదులను అంగీకరించలేదు.
అతని హృదయము నివృత్తి తత్వము తో నిండియుండి, పవిత్ర చిత్తమును కలిగి యున్నాడు.
యజ్ఞము అంటే, నిజమైన త్యాగము అని గుర్తించాడు...అదే భోధించాడు,
అన్నియుగములలోనూ అవతార పురుషులు, తాము ఆచరించి, ఆదర్శములను అందరికీ, అందించారు.
వేదము "ప్రజ్ఞానం బ్రహ్మ" అన్నది.
అదియే బుధ్ధుని తత్వము!..
అదే(Constant Integrated Awareness) ఎప్పటికిని పూర్ణమైనది.
No comments:
Post a Comment