Sunday, June 23, 2024

మనం జప ధ్యానములు ఆచరించడం అవసరమా???*

             *_నేటి మాట_*

*మనం జప ధ్యానములు ఆచరించడం అవసరమా???*

లోకమున సద్గుణములున్న వారినే అందరూ ప్రేమింతురు, దుర్గుణములుంటే దూరమగుదురు...
" సద్గుణ ములను చూసి, సర్వేశ్వరుడు కూడా ప్రేమించును సంతోషించును"...
లోకుల  ప్రేమకు లొంగవద్దు, లోకుల ప్రేమ క్షణక్షణమునకూ మారుతునే ఉండును, అది వారి ఇష్టాఇష్టాలపై ఆధారపడి యుండును...
     కానీ భగవంతుని ప్రేమ కేవలము సద్గుణ ముల పైనే ఆధారపడి యుండును...
 " జప ధ్యాన ముల ఫలమే సద్గుణ సంపద..."
లోకమును ఎవరైనా పాప కార్యము చేస్తే, దానిని గురించి కూడను సద్గుణ వంతులు ప్రసంగించ కూడదు. 
ఆ చింతలో వీరూ దిగవలసిన వచ్చును, కాన అందులో భాగము వహించిన వారల మగుదుము, పవిత్రుల యొక్క చరిత్ర లు తెలుసుకోవడమంటే, సత్కార్యము ఆచరించి నట్లే...

ధృవుడు ప్రహ్లాదుని కధలు వింటే పుణ్యము వచ్చును, సద్గుణ వంతులను నిందించువారు పాపులవుతున్నారు...
వారికి, కొద్ది పాటి పాప మేదైనా ఉంటే,  వారిని వీరు విమర్శించుటవలన , వారు పాపమునుండి విముక్తు లౌతారు...
విమర్శించిన వారు మాత్రము పాపఫలమును  పొందవలసి యుండును...
కనుక ఎదుటివాని దుర్మార్గమును గురించి గానీ, చెడ్డ ను గురించి గానీ ఎప్పుడూ తలంచరాదు...
ఇటువంటి సద్గుణ సంపద పొందవలెనన్న, జప ధ్యాన ములు ఆచరింపవలెను...

             *_🌺శుభమస్తు.🌺_*
 *🙏 సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment