*🍁విద్యార్థి తప్పు చేసినపుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షిస్తాడు. దాని అర్థం క్రింది విధాలుగా ఉంటుంది🍁*
1.మోకాళ్ళమీద కూర్చోబెడితే - వినయంగా ఉండాలని.
2.నోటిమీద వేలు వేసుకోమంటే - నీగురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని.
3.చెవులుపట్టుకోమంటే - శ్రద్ధగా వినమని.
4.బెంచీ ఎక్కి నిలబడమంటే - నీవు చదువులో అందరి కంటే పైన ఉండాలని.
5.చేతులెత్తి నిలబడమంటే - నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని.
6.గోడవైపు చూస్తూ నిలబడమంటే - ఆత్మ పరిశీలన చేసుకోమని.
7.తరగతిగది బయట నిలబెడితే - పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని.
8.బ్లాక్ బోర్డ్ తుడవమంటే - తప్పులు సరిచేసుకోమని.
9.ఏదైన విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే - గెలిచే వరకూ పోరాడమని.
No comments:
Post a Comment