స్థితులు సమానంగా ఉన్నా పరిస్థితుల్లో తేడాలు మనని నిత్యం దూరం చేస్తున్నాయి. మనం ఆ స్థితిలో ఉండగలిగితే, తానే ఆ బ్రహ్మపదార్థం అని తెలుకోగలిగితే ప్రత్యేకించి ప్రార్థించేందుకు ఏమి ఉండదు. కేవలం భక్తి, శరణాగతే మిగులుతాయి.
🌈 నిరంతరం నవ్యత కోసం ప్రాకులాడే మనసు సుఖసంతోషాలు ఎక్కడో ఉన్నాయని వెదికి వెదికి చివరకు అవితన మూలంలోనే ఉన్నాయని తెలుసుకుంటుంది. ఉన్నది ఉన్నట్లుగా ఉండటం సుఖం కాదనుకొని పరుగులు పెట్టినా... ప్రతిసుఖం వెనుక, సంతోషం వెనుక ఉన్నది ఆనిశ్చలతే అని ఒకనాటికి తెలుస్తుంది. ఆత్మ సంబంధంలేని సంతోషమే లేదు. మనకు తెలిసినా తెలియకపోయినా మనకి సంతోషం కలిగిందంటే మన మనసు తన మూలమైన ఆత్మతో కలిసిందనే అర్థం. అదే ఆత్మానుభవమని శ్రీరమణభగవాన్ అంటున్నారు. అది తెలియక సంతోషం బయట నుండి వస్తుందని మనసు భ్రమిస్తుంది. “కుక్క ఎండిపోయిన ఎముకముక్కను కొరుకుతున్నప్పుడు తన పళ్లనుండి వచ్చే రక్తాన్నే చీకుతూ అది ఆ ఎముక నుండి వస్తుందని భ్రమిస్తుంది" అని భగవాన్ ఈ విషయాన్ని సోదాహరణంగా వివరించారు. మనం సాధనకి, శాంతికి అడ్డం అనుకొనే కామ క్రోధాలు ఎవరిని ఆవరించి ఉన్నాయో లక్షణాలని మనకి తెలుస్తుంది. మల్లె, గులాబీల గుణాలు ప్రకృతివే గానీ మీవి కావుకదా.
🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment