Friday, June 28, 2024

🍁 *ఆత్మగౌరవం* 🍁
      🇮🇳🇮🇳🇮🇳
👍"ఒక వ్యక్తి తనకు తాను ఇచ్చుకునే అత్యున్నత పురస్కారం "ఆత్మగౌరవం".    మిమ్మల్ని మీరు గౌరవించుకుంటేనే  మీరు ఇతరులను గౌరవించ గలుగుతారు.    "వ్యక్తిత్వం"  తాలూకు ఉన్నతత్వాన్ని వ్యక్తపరచేది  "ఆత్మ గౌరవమే".     వ్యక్తి బాహ్య చర్యలను శాసించేది, నిర్ధారించేది ఆత్మ గౌరవమే.    "ఆత్మగౌరవం" గల వ్యక్తులు ఏర్పరచుకునే మానవ సంబంధాలు చీకటిలో "దీపం ". పరచే వెలుగులా ప్రకాశిస్తాయి.    "ఆత్మగౌరవం ". గల వ్యక్తులు తమతో తాము పరిచయం పెంచుకుంటారు.    తాము ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటారు. " సోక్రటీస్." "ఆత్మగౌరవం" గలవారు విలువలకు, నీతి నిజాయితీలకు  కట్టుబడతారు. "మంచిశ్రోత". గా ఎదుటి వారు చెప్పేది వింటారు. తమ ప్రవర్తనతోనే ఎదుటివారిలో   "పరివర్తన"  తెస్తారు. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో "అబ్దుల్ కలాం" ఓ  ఆణిముత్యం. "స్వచ్ఛమైన తామర పువ్వులా వికసించిన వ్యక్తిత్వం " ఆయనది. "ఆత్మ గౌరవం "గల వ్యక్తులు ఎలాంటి వారితోనైనా కలిసిపోతారు.   కానీ ఎల్లప్పుడూ "ఆత్మగౌరవం" విషయంలో విషయంలో మంచి  స్పృహ కలిగి ఉంటారు.    చులకన చేస్తే అంతే త్వరగా విడిపోయి, దూరంగా వెళ్ళిపోతారు. "ఆత్మగౌరవం".  ఉన్న వ్యక్తులే   "ఆపన్న హస్తం" అందించడానికి సిద్ధంగా ముందుకొస్తారు.   వీరు నిస్వార్ధమైన. " సేవా తత్పరత".   తో తరతమ భేదాలకు అతీతంగా "మానవ సంబంధా లకు" పెద్దపీట   వేస్తారు. తమలోని ప్రత్యేకతను గుర్తించి దాన్ని పదిమంది శ్రేయస్సుకు ఉపయోగించేవారు గా స్ఫూర్తి ప్రదాత లై ఉంటారు.    "ఆత్మ గౌరవం".  కలిగిన వ్యక్తులే ఆత్మ గౌరవం గల వ్యక్తుల్లో   "ఆత్మ  స్థైర్యం", "నమ్మకం"  ,"నిబద్ధత" ఎక్కువగా ఉంటాయి.    ఆ నమ్మకాన్ని   అప జయాలకు, అన్యా యం, అక్రమాలకు బలి చేయరు.     తమ నమ్మకాన్ని బతికించుకునే ప్రయత్నం చేస్తారు. అపజయాలు ఎదురైనా అవి "తాత్కాలికమే" అనుకుని ముందంజ వేస్తారు.    ఓటమిని ఓడించి విజేతలయ్యేందుకే   కృషి చేస్తుంటారు.         స్థితప్రజ్ఞుత, ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తులు, సాధించిన విజయాలతో సంతృప్తి చెందరు. నిరంతరం ప్రయత్నిస్తూ, శ్రమిస్తూనే ఉంటారు. "లక్ష్యం ".  మారినా వారి "గమ్యాన్ని "విస్మరించరు. ప్రేమించే హృదయం, స్పందించే మనసు, "పని చేసే చేతులు" ఆత్మగౌరవానికి ప్రతీకలు అంటారు   "స్వామి వివేకానంద". "ఆత్మ గౌరవానికి"- "ఆత్మజ్ఞానాన్ని"  కి  ప్రత్యక్ష సంబంధం ఉంది. "ఆత్మగౌరవం".  ఉన్న వ్యక్తులు " శ్రీహరి సర్వోత్తమ తత్వము" వైపు దృష్టి సారిస్తారు.  "  దేనినైనా.  స్వీకరించినంత తొందరగా   త్యజించనూ గలరు.    "గౌతమ బుద్ధుడు," రమణ మహర్షి,"   ,"స్వామి వివేకానంద", "జిడ్డు కృష్ణమూర్తి" వంటివారు ఆత్మగౌరవానికి ఆత్మజ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని మనమధ్యే సంచరించిన యోగులు.   "ఆత్మగౌరవం".  ఒకరు ఇస్తే వచ్చేది కాదు. మరొకరిని చూసిన ప్రేరణతో లభించేది. కాదు.   "ఆత్మగౌరవం" ద్వారా   ఆత్మ జ్ఞానం పొందిన యోగులు తరతమ భేదాలకు అతీతంగా సృష్టిలో ఏ ప్రాణితోనైనా బంధాలు ఏర్పరచుకుంటారు, సంభాషిస్తారు, ఆదరిస్తారు.    "ఆత్మగౌరవం"  ద్వారా ఆత్మజ్ఞానం, వినమ్రత, నిజాయితీ, శాంతము తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక సంపద "సిద్ధిస్తాయని రామకృష్ణ‌ పరమహంస బోధించారు.
              🙏🙏🙏            "జగద్గురు శ్రీ. మధ్వాచార్యులు",  ద్వైత సిద్ధాంతాన్ని, ప్రచారం చేయటంలో సిద్ధహస్తులు 
అయైనారు.   " శ్రీ శంకరాచార్యులు " "అద్వైత సిద్ధాంతమును", ప్రతిపాదించినారు.   అలాగే " శ్రీ రామానుజాచార్యులు"
విశిష్ట అద్వైతమును, రూపొందించినారు. 
బౌద్ధ ,జైన, చార్వక, జరదుష్ట, అక్బర్, మీరాబాయి, తులసీదాసు, కబీరు, వల్లభాచార్యులు, గురునానక్, ఇలా అనేక సిద్ధాంతం లను మన భారత దేశంలో పుట్టిన 
కొన్ని మోక్ష మార్గమును, కొన్ని భక్తి మార్గమును, 
భగవంతుడు ఒక్కడే అని, భగవంతుడు లేడు అని, వేదములను నమ్మని మతాలు, అహింస యే పరమధర్మమని, దృష్టులను  మోహపరిచే సిద్ధాంతాలు, పుట్టినవి, కొన్ని నశించినవి.  మరికొన్ని నేడు ఆచరించబడేవి, ఉన్నవి.
"ఆత్మ "అనే పదం  తో నేడు మనము మాట్లాడుకునేది,
 ఆత్మగౌరవం" ,"ఆత్మబలం 
" ఆత్మవిశ్వాసం", ఆత్మ నిబ్బరము,  "ఆత్మబంధువు"                 ( ఆత్మీయులు), ఆత్మజ్ఞానం, ఆత్మహత్యలు( ఆత్మాహుతి) , ఆత్మ విమర్శ, ఆత్మాభిమానం, ఆత్మ పరిశీలన, ఆత్మవిజ్ఞానం, 
, " ఆత్మీయ అతిధి", ఆత్మ నివేదన, ఆత్మసాక్షి, ఆత్మ నిబ్బర భారత్, అని పేరు పెట్టవచ్చు.  వాడుకలో ఉన్నప్పటికీ, వాటి అర్థములను గురించి తర్వాత విడిగా,  వివరంగా, విశదంగా ముచ్చటించుకుందాం! 
💅🏼"సేకరణ": *తలారి సత్యప్రకాష్* 🌹🙏
🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩

🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

No comments:

Post a Comment