Wednesday, June 12, 2024

****అనవసరాలు - అనర్ధాలు అన్నీ ఆపటమే ఆధ్యాత్మికత.

 నిరంతరం ఎదో ఒక భావం లోపల కదులుతూనే ఉంటుంది. ఆ భావానికి తగ్గట్టుగా భావోద్వేగాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి.ఇది మనసు గతాన్ని నెమరువేసుకుంటున్న పద్దతి.
కొన్ని జంతువులు ముందు ఆహారం తినివేసి - తరువాత తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాయి.
ఇదే పద్దతిలో అవసరం లేక పోయినా నిరంతరం ఎదో ఒక విషయాన్ని మనసు నెమరు వేసుకుంటూ - మనను ఆ భావాలకు గురి చేస్తూ ఉంటుంది. ఈ అనవసరాలను నెమరు వేసే పద్దతిని ఆపటమే ఆధ్యాత్మికత. ముందు మనలో జరుగుతున్న ఈ నెమరువేత పద్దతిని గుర్తించి - అనవసరముగా మనసు కదిలి- ఆలోచన కదిలి - భావము కదలిన ప్రతిసారి - ఇప్పుడు దీనితో నాకు పనిలేదు అని ఆ భావాన్ని స్వీకరించటం మానివేసి - ఆ ఆలోచనను నిరాకరించి మౌనముగా ఉండటం నేర్చుకుంటే - మనసు మన ఆధీనములోనికి వస్తుంది. అనవసరాలు - అనర్ధాలు అన్నీ ఆపటమే ఆధ్యాత్మికత. ఏ ధ్యాస లేకుండా కాసేపు మీలో మీరు - మీతో మీరు వుండండి. ఇదే ధ్యానము లేక తప్పసు. ఇలా ఏ ధ్యాస లేకుండా ఉండలేకపోతె మీకు నచ్చిన ధ్యాన పద్దతిని పాటించుకోండి. కాని గుర్తుంచుకోండి ఇక్కడ కూడా మీరు మనసును, ఊహలను ఉపయోగిస్తే అది నెమరువేతే అవుతుంది.మీ వీలును బట్టి చేసుకోండి. 🌹god bless you 🌹

No comments:

Post a Comment