Friday, June 28, 2024

 *భ్రష్టస్య కావా గతి*
                 


*రాజులు జూద ప్రియులు.   భోజరాజు జూదమాడేవాడు.    అదొక వ్యసనంగా మారింది.   ఆయన భార్య  లీలావతి యిక భరించలేక ఆయనచేత యెలాగైనా ఈ వ్యసనం మాన్పించమని   కాళిదాసును కోరింది.*

 *కాళిదాసు భిక్షువు వేషం వేసుకొని దండ కమండలాలు ధరించి  భోజుడు జూదశాల కు పోయే మార్గములో ఒక మాంసపు అంగడి దగ్గర మాంసము బేరమాడు తున్నాడు.*

*భోజుడది చూసి ఆశ్చర్యముతో అతనిని సమీపించి…*
 
 *”భిక్షో మాంస  నిషేవణం కిముచితం”*

*”ఓ సన్యాసీ!!  యోగులకు మాంసము నిషేధము కదా!      యిదేమి   మీరు మాంసమును బేరమాడుచున్నారు, యిది తగునా...”*

*భిక్షు:-  “కిం నేనా మద్యం వినా...”*

  *“మాంసమేనా దీనితో పాటు మద్యము కూడా వుండవలెను కదా!”*

*భోజ:- “మద్యం చాతీవ ప్రియం”*

 *”మద్యము కూడా త్రాగుతారా...”*

*భిక్షు:-“ప్రియమహో వారాంగనా భీస్సః”*

 *”వారకాంతలతో కలిసి త్రాగుట నాకు చాలా యిష్టము.”*

*భోజ:-“వారస్త్రీ రతయే కుతః  తవ  దనం”*

   *”భోగ స్త్రీలకిచ్చుటకు నీకు ధనమేక్కడిది”*

*భి:- “చౌర్యేణ ద్యూతేనవా”*

 *”దొంగతనముచేతను, ,జూదము చేతను సంపాదించెదను.”*

*భోజ:- “చౌర్య ద్యూత పరిశ్ర యౌస్తి భవతాం...”*

 *”మీరు దొంగతనము చేస్తారా, జూదము కూడా ఆడుతారా,” అని అడిగాడు ఆశ్చర్యంగా.*

*భి:-  “భ్రష్టస్య కావా గతి?”*

  *”చెడిపోయిన వాడికి వేరు గతి ఏమున్నది?”*

*శ్లోకం పూర్తయింది,  అనిపించింది రాజుకు*

*భిక్షో మాంస నిషేవణం కిముచితం?*
*కిం తేన మద్యం వినా*
*మద్యం చాపి తవ ప్రియం?*
*ప్రియమహో వారాంగనాభి స్సహ!*
*వారస్త్రీ రతయే కుతః తవ దనం?*
*ద్యూతేన చోరేణవా*
*చౌర్య,ద్యూత పరిశ్రమాపి  భవతాం?*
*భ్రష్టస్య కావా గతిః*
 
*భోజరాజు   కాళిదాసును గుర్తించాడు. కాళిదాసు భోజరాజుకు.. “మీకిది తగదు మహారాజా!” అని నచ్చ  చెప్పాడు. రాజు సిగ్గుపడ్డాడు. అతని మనో భావం గ్రహించాడు. “యిప్పటి నుండీ  జూదము ఆడన”ని ప్రమాణం చేశాడు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment