Sunday, June 23, 2024

 *ఆచార్య సద్భోదన!!!*
               
*భగవంతుని స్థానమైన సత్యమనే ధామం యొక్క గడప వద్దకు చేరుకున్నప్పుడే అసలైన ఆనందం అంటే ఏమిటో బోధపడగలదు.*

*ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నా మానవుడు తృప్తినొందడు. అతడు మరింకేదో కావాలని ఆశిస్తూ ఉంటాడు.    కానీ ఈ బాహ్య ప్రపంచంలో అది లభ్యం కాదు.*

*అయితే అది ఎక్కడో లేదు. మనలోనే దాగి ఉంది. మన అంతరంగ మూలాల్లోనే ఈ ఆనందం దాగి ఉంది. అక్కడే భగవంతుడు వసిస్తున్నాడు. మనలోని దివ్యత్వం అక్కడే దాగి ఉంది.*

*సిరిసంపదలు, స్నేహితులు, బంధువులు ఏదో   ఒక సమయంలో మన అంచనాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ మన నమ్మకాన్ని వమ్ము చేయవచ్చునేమో కానీ మన అంతరంగంలో ఉండి మనలను నడిపించే ఆ శ్రీమన్నారాయణుడు మాత్రం ఎన్నటికీ మనలను వదలడు. మనలను మోసం చేయడు.*

*నిజమైన ఆనందం భౌతికత్వంలో ఉండదు, అనంతత్వంలోనే ఉంది, అది అంతరంగంలోనే దాగి ఉంది.*

No comments:

Post a Comment