Friday, June 7, 2024

నిజమైన ఆధ్యాత్మిక సాధనలు ఇలాగే ఉంటాయి.

 ఎవరిని ఏమి కోపముగా, చెడుగా అనకుండా, ఎవరి గూర్చి ఎవరికి చెడు చెప్పకుండా, మన మనసులో కూడా ఎవరిని చెడుగా అనుకోకుండా -- మనకు ఇబ్బంది కలిగించే చిన్న చిన్న విషయాలలో కూడా ఇలా మనసును ఉంచుకోగలమా? ఇదే సాధన. అందరూ ప్రయత్నించవచ్చు. ఎన్ని సార్లు ఓడిపోయినా పరవాలేదు. కానీ ప్రయత్నం మానకుండా మళ్ళీ చేస్తూనే ఉంటే ఇది మనలో అద్భుతమైన మార్పులు తీసుకు వస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక సాధనలు ఇలాగే ఉంటాయి. ఇవి ఎవరికి వారే నిర్ణయించుకొని అంతరంగములో ఆచరించుకోవాలి. ఎదో గొప్పగా ఆందరికి చెప్పవలసిన అవసరము లేదు. ప్రయత్నిస్తే సాధనలో వునట్లే... 

Source - https://m.youtube.com/@divineplanet-designinglive1681/community

No comments:

Post a Comment