✅"ఎంతో మంచి ఆలోచన,ఒక్క సారి చదవండి!"💥
*స్విస్ టైమ్ బ్యాంక్*
స్విట్జర్లాండ్ లో చదివే ఓ విద్యార్థి పరిశీలన:
స్విట్జర్లాండ్ లో చదివేటప్పుడు నేను ఓ పాఠశాల దగ్గర్లోనే కిరాయికి ఉండే వాడిని.
మా ఇంటి ఓనరు,67 సం॥ల, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రిటైరైన ఒంటరి మహిళ.
ఆమెకు వచ్చే పెన్షనుతో ఆమె హాయిగా జీవించవచ్చు.
అయినప్పటికీ ఆమె ఒక 87సం॥ల వృద్ధునికి సేవ చేసే పనికి కుదిరింది.
నేనామెను డబ్బు కోసం పని చేస్తున్నారా?అని అడిగాను.
"నేను డబ్బు కోసం పని చేయడం లేదు,నా సమయాన్ని *'టైమ్ బ్యాంక్ '* లో దాచుకుంటున్నాను.
వృద్ధాప్యంలో,నేను కదలలేని పరిస్థితుల్లో తిరిగి వినియోగించుకుంటాను."అన్న ఆమె జవాబు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ టైమ్ బ్యాంక్ అనే భావన తొలిసారిగా విన్న నాలో ఆసక్తి పెరిగి మరిన్ని వివరాలడిగాను.
టైమ్ బ్యాంక్ అనేది స్విస్ ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం.
ప్రజలు తాము యవ్వనంలో,ఆరోగ్యంగా ఉన్నపుడు వృద్ధులకు,అనారోగ్యంగా ఉన్నవారికి సేవలందిస్తూ,సమయాన్ని దాచుకొని,
తిరిగి వారికి అవసరమున్నపుడు ఉపయోగించుకోవచ్చు.
దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి,ప్రేమపూర్వక సంభాషణా నైపుణ్యం కల్గి ఉండాలి.
ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి అందించగలగాలి.
వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలలో సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ జమ చేస్తుంది.
అలా ఆమె వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలందించడానికి వెళ్లేది.
వారి గదుల్ని శుభ్రం చేయడానికి,సరుకులు తేవడానికి,వారికి సన్ బాత్ లో సహకరించడానికి, కొద్దిసేపు ముచ్చడించడానికీ సమయాన్ని కేటాయించేది.
అంగీకారం ప్రకారం సంవత్సరం తర్వాత టైమ్ బ్యాంక్ ఆమె సేవాకాలాన్ని లెక్కించి,'టైమ్ బ్యాంక్ కార్డు'జారీ చేసేది.
ఆమెకు ఇతరుల సహాయం అవసరమున్నపుడు తన కార్డును ఉపయోగించుకుని తన ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకునేది.
ఆమె దరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్ ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపేవారు.
ఒకరోజు నేను స్కూల్లో ఉన్నపుడు ఆమె నన్ను పిలిచి,కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ పైనుండి జారిపడ్డానని చెప్పింది.
నేను వెంటనే సెలవు పెట్టి,ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లాను.
ఆమె మడమ దగ్గర విరిగి,కొంత కాలం పాటు మంచం పైనే ఉండవలసి వచ్చింది.
నేను కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండడానికి సిద్ధమౌతుంటే,ఆమె ఏమీ దిగులు పడనవసరం లేదన్నది.
ఆమె అప్పటికే టైమ్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నది.
ఆశ్చర్యకరంగా రెండు గంటల్లోపే ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వాలంటీరును పంపించింది.
ఆనెలంతా ఆ వాలంటీర్ ప్రతిరోజూ ఆవిడ బాగోగులు చూసుకుంటూ, రుచికరమైన వంటలు చేస్తూ,సరదాగా కబుర్లు చెబుతూ ఉండేది.
సరైన సేవల వల్ల ఆమె త్వరలోనే కోలుకుని,తిరిగి తన పనులు తాను చేసుకోవడం మొదలైంది.
తానింకా ఆరోగ్యంగానే ఉన్నందున తిరిగి టైమ్ బ్యాంక్ లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆమె.
ఈరోజుల్లో స్విట్జర్లాండ్ లో వృద్ధులకు టైమ్ బ్యాంకులు సేవలందించడం అనేది సర్వసాధారణమైంది.
ఈ విధానం దేశ భీమా ఖర్చుల్ని తగ్గించడమే కాక, అనేక సామాజిక సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది.స్విస్ ప్రజలు కూడా ఈ విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.
ఒక సర్వే ప్రకారం సగం మంది స్విస్ పౌరులు ఈ విధానంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది.
ప్రభుత్వం కూడా ఈ 'టైమ్ బ్యాంక్ 'విధానాన్ని చట్టబద్ధం చేసింది.
ప్రస్తుతం ఆసియా దేశాల్లో కూడా క్రమంగా "ఒంటరి గూటి-వృద్ధ పక్షులు" పెరిగి పోవడం ఒక సామాజిక సమస్యగా మారుతున్నది.
👍ఆలోచించండి!మనకు కూడా స్విట్జర్లాండ్ *"టైమ్ బ్యాంక్ "* విధానం ఒక మహత్తరమైన ప్రత్యామ్నాయమే కదా...!?
No comments:
Post a Comment