Friday, June 28, 2024

HOW TO HELP OTHERS? | EXCERPTS FROM DIVINE DISCOURSE

 *HOW TO HELP OTHERS? | EXCERPTS FROM DIVINE DISCOURSE | DATE 17-02-1996 .*

  *ప్రేమ స్వరూపులారా!!!*

 *సహాయం అంటే ఏమిటి?  ఒక చిన్న ఉదాహరణం.  మీరందరు కూడను బస్సుల్లో వస్తుంటారు, ట్రైనుల్లో వస్తుంటారు, ఇంకేవిధమైనటువంటి వాహనాల్లో వస్తుంటారు.  అయితే ఆ ట్రైన్ లో వచ్చే సమయంలోనో, బస్సులో వచ్చే సమయంలోనో, ఏ విధంగా హెల్ప్ చేయడం?  ఏ విధమైన సహాయం చేయడం?  ఆ బస్సులో వృధ్ధులో లేక స్త్రీలో సీటు చిక్కక నిలుచుకోని ఉంటారు.  అలాంటి సమయంలో నీవు సీటులోంచి లే, వాళ్ళకు ఆ సీటు ఇచ్చేయి.* 

*చిన్న పిల్లలు ఉంటుంటారు, వాళ్ళు కూడా కూర్చోడానికి స్థలం ఉండదు, వాళ్ళకా సీటు ఇచ్చేయి, నువ్వు లేచి నిలుచుకో.  ఇలాంటి సహాయాలు ఎన్నైనా చేయొచ్చు మన జీవితంలో.  ఈనాడు, ముఖ్యంగా యువకులు చేయవలసినటువంటి సేవ ఇది.*

*బస్సులో కూర్చొంటారు,  ఇంకా రెండు సీట్లను ఆక్రమిచుకుంటారు,  స్త్రీలో, వృధ్ధులో ఎవరైనా వస్తే, వారు నిలుచుని బాధపడుతుంటే వీళ్ళు  చూచి నవ్వుతుంటారు.  ఈ నాటి మానవుని యొక్క గుణములంతా ఈ విధముగా ఉంటున్నాయి.* 

*సినిమాలో కష్టపడేటువంటి వారిని చూస్తే, కంటి నీరు కార్చిపోతారు.  సినిమా పిక్చరులో ఉండేటువంటిదాన్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు.  ప్రత్యక్షంగా బాధపడుతున్నటువంటి వారిని చూసి వెక్కిరిస్తారు.  ఇదా మానవుల యొక్క లక్షణం?*

*ఇది కాదు, ఎక్కడైనా దయ దయనే!  అందరి యందు మనం COMPASSION చూపాలి.  *ఈ COMPASSION చూచుకోకుండా పోవడం చేతనే, ఇప్పుడు COMPASSION లేకుండా పోవడం ఒక FASHION అయిపోయింది!  మనకు FASHION కాదు COMPASSION కావాలి.*  ఈ విధమైనటువంటి KIND అంటాము, MAN KIND అంటాము. MAN ఉన్నాడు కానీ KINDNESS లేదు. MAN అంటే ఎవరు?   KINDNESS ఉన్నటువంటివాడే MAN.  అందువలనే "MANKIND" అన్నారు.*

*ఈనాడు KINDNESS లేదు.  కనుక, ఆ కరుణను ఈ నాడు మనము అభివృధ్ధి పరుచుకోవాలి.  ఆ దయను ఈనాడు పెంచుకోవాలి.  ఇదియే మన జీవితానికి మంగళకరమైనటువంటినది.  ఎక్కడకు పోయినప్పటికిని విద్యార్ధులు ఉంటుంటారు,  ఎక్కడైనా ఎవరో కొంచెం అశాంతిగా, కొంచెం బాధలు పడుతుంటారు.  కానీ, అట్టివారికి తగిన సహాయం మనము చేయాలి.*

No comments:

Post a Comment