నమ్మకాలు-Instant Results
మీరు ఏర్పరుచుకున్న నమ్మకాలే మీ జీవితాన్ని నడిపిస్తున్నాయి. కాబట్టి మీ జీవితం మారాలి అంటే మీరు ఎరుకలో ఉండి నమ్మకాలను మార్చాలి. అప్పుడే మీరు కొత్త కొత్త అనుభవాలను పొందుతారు. లేకుంటే అవే పాత అనుభవాలు కొనసాగుతాయి. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటను, అలాగే ప్రతి ఆలోచనను గమనిస్తూ, వాటికి సంబంధించిన నమ్మకాలను వదిలేసి కొత్త నమ్మకాలను ఏర్పరుచుకోండి.
దృష్టిని బట్టి సృష్టి, స్థితిని బట్టి గతి, యద్భావం తద్భవతి అనే అపరిమితమైన నమ్మకాలను ఏర్పరుచుకుని వాటిని మీరు గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ఇవి మీకు ఎప్పుడు కొత్త కొత్త అనుభవాలను ఇస్తూనే ఉంటాయి కాబట్టి. మీ దృష్టిని, మీ స్థితిని, మీ భావనను మార్చుకున్న వెంటనే, దానికి తగ్గట్టు బాహ్యంగా ఫలితం కూడా మారుతుంది.
కాబట్టి చలనం లేని పరిమితమైన నమ్మకాలను లేదా స్థిరమైన అభిప్రాయాలను, అంటే...
బీపీ ఇంతే ఉండాలి, షుగర్ ఇంతే ఉండాలి,
శరీరం యొక్క బరువు ఇంతే ఉండాలి,
ఇది మంచి ఆహారం, అది చెడ్డ ఆహారం, అనారోగ్య సమస్యలకు పరిష్కారం లేదు,
ఆర్థికంగా ఎప్పుడు లోటు ఉంటుంది, బంధాలకు అతీతంగా చేరలేము,
కోపం ఉండకూడదు, ఎప్పుడూ శాంతంగానే ఉండాలి,
ఇది మంచి గుణం, అది చెడ్డ గుణం,
ఇది పాపం, అది పుణ్యం, పాప-పుణ్యాలకు అతీతంగా చేరలేను,
ప్రారబ్దం ప్రకారమే మన జీవితం నడుస్తుంది, అనుకున్న వెంటనే ఫలించదు,
ఇది మంచి ప్రదేశం, అది చెడ్డ ప్రదేశం, ఇది కలుషిత వాతావరణం,
ఇది మాయా ప్రపంచం, నేను ఒకసారి ఒకే శరీరంలో ఒకే ప్రాంతంలో ఉంటాను,
ఇది మంచి కాలం, అది చెడ్డ కాలం, ఇది మంచి సమయం, అది చెడ్డ సమయం,
ఈ గ్రహాలు మంచివి, ఆ గ్రహాలు చెడ్డవి,
ఇది కలియుగం, నాది పరిమిత శరీరం, నాది పరిమిత మనసు,
నా ఇంద్రియాలు శరీరం వరకే పరిమితమై ఉన్నాయి... మొదలగు ఎదుగుదలకు అవకాశం లేని నమ్మకాలను వదిలేయండి. ఎందుకంటే ఇవి మిమ్మల్ని పరిమితం చేసి బంధిస్తాయి కాబట్టి.
కనుక నేను సూచించే ఈ స్వేచ్ఛ తో కూడిన నమ్మకాలను ఎంపిక చేసుకోండి:
నేను పెట్టుకునే సంకల్పానికి నేను పోషించే పాత్రకు తగ్గట్టు - బీపీ షుగర్ రీడింగ్స్ ఉండాలి శరీరాకృతి ఉండాలి శరీర బరువు ఉండాలి,
అన్ని దివ్యమైన ఆహారాలే, అన్ని దివ్యమైన గుణాలే, అన్ని దివ్యమైన కాలాలే,
అన్ని దివ్యమైన సమయాలే, అన్ని దివ్యమైన ప్రదేశాలే, అన్ని దివ్యమైన గ్రహాలే,
అన్ని దివ్యమైన యుగాలే, ఇది దివ్యమైన వాతావరణం, ఇది దివ్యమైన ప్రపంచం,
నేను ఒకేసారి అనేక శరీరాలలో అనేక ప్రాంతాలలో ఉంటాను,
అనంతమైన విశ్వ శరీరమే నా శరీరం,
అనంతమైన విశ్వ మనసే నా మనసు,
నా ఇంద్రియాలు అనంతంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి,
అన్ని అనారోగ్య సమస్యలకు దివ్యమైన పరిష్కారం ఉంది,
ఆర్థికంగా ఎప్పుడు సమృద్ధిగా ఉంటాను,
బంధాలకతీతంగా సులభంగా చేరుతాను,
పాపపుణ్యాలకు అతీతంగా సులభంగా చేరుతాను,
అనుకున్న వెంటనే ఫలిస్తుంది,
శరీరం ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,
మనసు ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,
బుద్ధి ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,
ఎవరు ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,
ప్రపంచం ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,
సమస్యలలో కష్టసుఖాలలో కూడా నేను ఆనందంగా ఉంటాను,
ఉచ్చ-నీచ స్థితులలో కూడా నేను ఆనందంగా ఉంటాను,
వర్తమాన స్థితి ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,
ప్రారబ్ధం ప్రకారం కాకుండా ఆనందంగా ఉన్నప్పుడు నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది...
ఈ విధమైన స్వేచ్ఛతో కూడిన నియమాలులేని (unconditional) నమ్మకాలను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే నేను అంటేనే దేని మీద ఆధారపడని ఆనందం (Independent Bliss).
కనుక పరివర్తనకు అవకాశం లేని నమ్మకాలను గట్టిగా పట్టుకోవడం మూఢనమ్మకమే అవుతుంది. ఎందుకంటే కదిలే శక్తి యొక్క తత్వం ఎప్పుడు మారుతూ పరివర్తన చెందుతూనే ఉండడం. కనుక పరిమిత నమ్మకాలన్నీ మూఢనమ్మకాలేనని ఇక్కడ గ్రహించండి.
అందువలన మీరు ఎప్పుడూ తెరిచిన మనసుతో తెరిచిన హృదయంతో ఉండండి.
అంటే యద్భావం తద్భవతి, దృష్టిని బట్టి సృష్టి, స్థితిని బట్టి గతి,
ఏదైనా సరే అనుకున్న వెంటనే ప్రత్యక్షమౌతుంది మాయమౌతుంది... ఇలాంటి స్వేచ్ఛతో కూడిన అపరిమితమైన నమ్మకాలను గట్టిగా పట్టుకోండి.
అలాగే ఈ సృష్టిలో కదలని శక్తి చైతన్యం 50%,
కదిలే నిరాకార శక్తి-చైతన్యం 49%,
శక్తి-చైతన్యంతో తయారైన నామరూపక్రియలు 1% ఉంటాయి.
అంటే నిరాకారం 99% - ఆకారాలు 1%;
కదిలేవి 50% కదలనిది 50% ఉంటాయన్నమాట.
సాధన
మీరు పరిమిత ఆకారాలను వదిలేసి తగినంత సమయం ప్రశాంతంగా ఉంటే ఆనంద స్థితి లేదా నిరాకార స్థితి దానంతటదే ప్రత్యక్షమౌతుంది. ఎలాగైతే ఉప్పును నీళ్లలో కలపడం వలన ఉప్పదనం అనేది నీళ్లు మొత్తం వ్యాపిస్తుందో, అలాగే 1% పరిమిత మంచి-చెడు ఆకారాలను పరిమిత నమ్మకాలను, ప్రత్యక్షమైన 99% అనంతమైన నిరాకార స్థితిలో కలపండి. ఇలా ఏకం చేయడం వలన ఆకారాలు కూడా అనంతమౌతాయి. దీని వలన జీరో స్టేట్ లేదా శూన్యస్థితి లేదా ఏకత్వ స్థితి ప్రత్యక్షమౌతుంది. ఈ నిరాకార శక్తి-చైతన్యం యొక్క కలయికను సచ్చిదానందస్వరూపం అని కూడా అంటారు.
ఇలా ఆకారాలు అంటే దేశకాలవస్తువులు, జీవజగదీశ్వర్లు, పాజిటివులు నెగెటివులు న్యూట్రల్లు జీవాత్మలు ఆత్మలు పరమాత్మలు... మొదలైనవన్నీ నిరాకారంతో కలిసి ముద్దగా ఏకమవడం వలన, ద్వంద్వ విభజన మాయమై ఏకత్వం ఏర్పడుతుంది. ఏకత్వస్థితిలో ముద్ద స్థితిలో సచ్చిదానంద స్థితిలో అన్ని ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే ఉంటాయి.
మీకు మరియు మీకు కావాల్సిన దానికి మధ్య దూరం ఉన్నప్పుడే అనుకున్నది జరగడానికి సమయం పడుతుంది. కానీ ఏకత్వ స్థితిలో మీకు మరియు మీకు కావాల్సిన దానికి మధ్య దూరం అనేదే ఉండదు. కాబట్టి అనుకున్న వెంటనే మీ సంకల్పం నెరవేరుతుంది.
ఇలా అనుకున్న వెంటనే ప్రతి దానిని సృష్టిస్తూ (Create Instant Results), నేనే సృష్టికర్తను అని అనుభవపూర్వకంగా తెలుసుకోండి.
No comments:
Post a Comment