Saturday, December 21, 2024

 నేస్తమా….

నీ కలలను కనడంతోనే రాజీపడకు…

నీ కలల కౌగిట్లోనే కాలం గడపేయకు…

నీ కలలను చీకట్లోనే కరిగిపోనివ్వకు…

నీ కలలను కల్లలుగానే మిగిలిపోనివ్వకు….

నీ కలలను నిశీధిలోనే సమాధి చేయకు….


లే మేలుకో

నీ కలలను సాకారం చేసుకోవడానికి వేయి అడుగు ముందుకు….

నీ స్వప్న సౌధాన్ని నిర్మించుకునేవరకు  విశ్రమించకు…

నీ ఆశల పల్లకీ అందుకొనే వరకు అలుపెరుగకు…

నీ ఆశయాల గమ్యాన్ని చేరేవరకు విశ్వాసాన్ని వీడకు…

నీ ఆకాంక్షల లక్ష్యాన్ని సాధించేవరకు పట్టు విడువకు…

నీ జయ కేతనం ఎగరేసేవరకు పరులను పట్టించుకోకు…

నీ విజయ దుందుభి మోగేవరకు విసుగు చెందకు…

నీ గెలుపు హారతి అద్దుకునే వరకు వెనుతిరగకు….

నీ జయజయధ్వానాలు మార్మోగేవరకు పయనం ఆపకు…

నేస్తమా….

మంచి రోజు, మంచి శకునం కోసం ఎదురు చూడకు…

ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే
మంచి ఘడియ మొదలుపెట్టు………
సాగిపో ……..
ఆకాశమే హద్దు నీకు…….

నేస్తమా నీకు విజయోస్తు….


Life lessons

No comments:

Post a Comment