Tuesday, December 24, 2024

 గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన
 పాలనీక తన్ను పండ్లురాల
 లోభివాని నడుగ లాభంబు లేదయా
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడా వ్యర్థము.

 పెట్టిపోయలేని వట్టి నరులు భూమిఁ
 పుట్టనేమి వారు గిట్టనేమి
 పుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఎదుతి వారికి సహాయము చేయనివాడు పుట్టినా చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుట్టినా, చచ్చినా ఒకటే కదా!

 ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
 తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక
 మురికి భాండమందు ముసుగు నీగల భంగి
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.  

No comments:

Post a Comment