Saturday, December 21, 2024

****భారతీయులు ఎందుకు "అవినీతిపరులు"? వారి ప్రవర్తనలో, ఉన్న లోపం ఏమిటి?

 భారతీయులు ఎందుకు "అవినీతిపరులు"?
వారి ప్రవర్తనలో, ఉన్న లోపం ఏమిటి?
——————————————————————

చేదు వాస్తవాలుతో కూడిన వ్యాసం ఇది.

ఇది భారతదేశంలోని, "అవినీతి"పై ఒక న్యూజిలాండర్ చెప్పిన అభిప్రాయం. 

భారతీయులు (hobbesian) స్వార్థపరులు. "అవినీతి", భారతదేశ సంస్కృతిలో ఒక భాగం. "అవినీతి"ని భారతీయులు, "నీతిబాహ్యం"గా చూడరు. ఇది దేశమంతటా వ్యాపించి ఉంది.
భారతీయులు "అవినీతిపరుల"ను ఓపికతో భరిస్తారు, కానీ  సంస్కరించడానికి పూనుకోరు.
ఏ జాతి కూడా, పుట్టుకతో "అవినీతిమయం"గా ఉండదు.

భారతీయులు, "అవినీతిపరులు" ఎందుకు అవుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే, వారి ఆచారవ్యవహారాలను చూడాల్సిందే.

మొదటగా ..

భారతదేశంలో అంతర్గతంగా, ఒక వ్యాపార ప్రక్రియ ఉంది. అది, "భారతీయులు" దేవుడికి డబ్బులు అర్పిస్తారు. అర్పించి, దాని కంటే ఎక్కువ "ప్రతిఫలాన్ని" ఆశిస్తారు. దీని అర్థం ఏమిటంటే, ఎలాంటి అర్హత, అవసరం, ప్రమాణము లేకున్నా, తాము గొప్ప "లబ్ది" పొందాలనుకోవడమే.
అదే, గుడి వెలుపల, ఇటువంటి వ్యాపార ప్రక్రియను *"లంచం"* అంటాము.

బాగా ధనవంతుడైన భారతీయుడు, గుళ్లకు డబ్బు ఇవ్వడు. కానీ, బంగారుకిరీటాలు, వెండి తొడుగులు వంటి ఇతర అత్యంత విలువైన ఆభరణాలు "కానుకలు"గా ఇస్తాడు. అతని కానుకలు పేదవాడి "ఆకలిదప్పులు" తీర్చవు. అతడు ఇచ్చేది, కేవలం ఆ దేవుడికి. ఆకలిగొన్న వాడికి, సహాయం చేయడం వృధా ప్రయాసము అనుకుంటాడు. అందుకే, దేవునికి అత్యంత విలువైన "కానుకలు" ఇస్తాడు.

జూన్ 2009 లో, హిందూ దినపత్రిక, ఒక వార్త ప్రచురించింది. 

అదేమిటంటే, జి.జనార్దన్ రెడ్డి, కర్ణాటక మంత్రి, 45 కోట్ల రూపాయలతో, డైమండ్స్ పొదిగిన ఒక బంగారు కిరీటాన్ని, తిరుమల వారి గుడికి "కానుక"గా ఇచ్చాడు.

ఈ విధంగా, విపరీతమైన సంపద, ఈ భారతదేశంలోని కొన్ని గుళ్ళల్లో పోగు పడుతుంది. ఈ "సంపదను" ఏం చేయాలో, వారికి అర్థం కాదు. కోశాగారాలలో, బిలియన్ల కొద్దీ ఆస్తులు, డబ్బులు, "దుమ్ము" కొట్టుకు పోతున్నాయి.

యూరోపియన్లు, భారతదేశానికి వచ్చి, పాఠశాలలు నెలకొల్పారు. కానీ, భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి, అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు.

తన కోర్కెలను తీర్చడానికి, దేవుడు "కానుకలు" తీసుకోవడం ఎట్లా తప్పు కాదో, బయట కూడా "లంచం" తీసుకోవడం, ఇవ్వడం కూడా తప్పు కాదు అనే భావన అంతట నెలకొంది. అందుకే, భారతీయులు తేలికగా "అవినీతికి" లొంగిపోతారు.

ఈ దేశ సంస్కృతి, "అవినీతి"ని తనలో ఇముడ్చుకుంటుంది.

1."అవినీతిని" భారతీయులు ఒక మచ్చగా భావించరు. ఎందుకంటే, బాగా అవినీతిపరులైన  రాజకీయ నాయకులను, వారు అధికారంలోకి తెస్తారు. 

ఇది పశ్చిమ దేశాలలో, మనం ఊహించలేము.

2.చరిత్ర చూసినా కూడా, అవినీతికి ఊతమిచ్చే నైతిక దిగజారుడుతనమే కనిపిస్తుంది. 

భారతదేశ చరిత్రలో, "లంచాలు"కు లొంగి, కోట ద్వారాలు తెరవడం ద్వారా, అనేక పట్టణాలు, రాజ్యాలను  వశపరచుకున్న "సంఘటనలు" అనేకం. డబ్బు తీసుకొని లొంగి పోయిన సైన్యాధిపతులు కూడా అనేకం. ఇది భారతదేశం అంతటా ఉన్న "సారూప్యత".

పూర్వపు గ్రీకు, మోడ్రన్ యూరప్ తో పోలిస్తే, భారతీయుల "పోరాటపటిమ" ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.

నాదేర్షాను అంతమొందించేందుకు, టర్క్ లు పోరాడారు. కానీ, భారతదేశంలో పోరాటం అవసరం లేదు, లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం, యుద్ధము, లేకుండా చేయవచ్చు. దండెత్తే వాడు, డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాడైతే, భారతీయ రాజులను తేలికగా లొంగ తీసుకోవచ్చు.
ఆ రాజుల దగ్గర, పదుల వేల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికీ, ఇది సాధ్యం.

ప్లాసి యుద్ధంలో, భారతీయులు గట్టిగా యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది, 
"మీర్ జాఫర్" కు, ఆంగ్లయుడు Clive laid "లంచం" ఇచ్చాడు. అంతే, బెంగాల్ రాజ్యము, ఈస్ట్ ఇండియా కంపెనీకి, పూర్తిగా లొంగిపోయింది.

భారతీయ కోటలను వశపరచుకున్న చాలా సంఘటనలలో, ఈ "డబ్బు మారక పాత్ర" చాలా ఉంది. 

డబ్బులు, ముట్టినందున గోల్కొండ  వెనుక కోటదర్వాజ తెరచి ఉంచడం వలన, 1867లో ఈ కోటను తేలికగా ఆక్రమించుకోగలిగారు.

మరాఠాలను, రాజపుత్రులను కూడా, ఈ "లంచాలు" ద్వారానే, "మొఘలులు" సులభంగా గెలుచుకోగలిగారు.

శ్రీనగర్ రాజు, ఔరంగజేబు దగ్గర  డబ్బులు తీసుకుని, సులేమాన్ ను అప్పగించాడు.

భారతీయులు "అవినీతి"కి తలొగ్గి, చేసిన "దేశద్రోహ కార్యక్రమాలు" అనేకం ఉన్నాయి.

అర్థం చేసుకోవాల్సినదేమిటంటే, భారతీయులకు ఇచ్చి పుచ్చుకునే (లంచాలు) "సంస్కృతి", ఎందుకు వచ్చింది. ఇతర నాగరిక దేశాలలో, ఇది ఎందుకు లేదు?

3. నైతికంగా, అవినీతిరహితంగా మసలుకుంటే, 'అందరము బాగుపడతాము' అనే స్వభావం, భారతీయులలో కొరవడడానికి మూల కారణం. వారు అనుసరించే "మతం"లో, ఆ సందేశం లేకపోవడమే.

కులవ్యవస్థ వారిని, "వేరు" పరుస్తుంది. మనుషులందరూ సమానమేనని వారు నమ్మరు. దీని ఫలితమే, ఈ విభజనలు.

మత మార్పిడులు జరిగాయి. చాలా మంది "హిందువులు" సిక్కులు, జైనులు, బౌద్ధులు అయ్యారు. ఇంకను బలవంతంగా, మత మార్పిడి వల్ల ఎంతో మంది క్రిస్టియన్లుగా, ముస్లింలుగా మారారు. భారతీయులు ఒకరిపై, మరొకరికి విశ్వాసం ఏమాత్రం ఉండదు.

భారతదేశంలో, నిజమైన భారతీయత ఉన్న భారతీయులు లేరు. ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు ముస్లింలు, మొదలగు వారు ఉన్నారు. 

1400 సంవత్సరాల క్రితం, "భారతీయులంతా" ఒకే విశ్వాసం కలిగి ఉండేవారు.

కానీ, తరువాత అనేక కులాలుగా, మతాలుగా విడిపోవడంతో, ఈ "అనారోగ్య సంస్కృతి" దాపురించింది. "అసమానతలు" అనేవి "అవినీతి సమాజాని"కి దారి తీస్తాయి. 

భారతీయులు ఒకరినొకరు ఈసడించుకుంటారు, ఒక్క దేవుడిని తప్ప. అతనికి కూడా లంచం ఇస్తారు. 

బ్రియాన్, 
న్యూజిలాండ్. 
 
(బాధతో వాస్తవాలను అంగీకరిస్తూ). 
ఇది ఉన్నది ఉన్నట్లుగా, ఏమాత్రం edit చేయకుండా, English వ్యాసాన్ని అనువదించడం జరిగింది.
(న్యూజిలాండ్, అతి తక్కువ అవినీతి ఉన్న దేశాలలో మొదటిది )

సురేందర్ ఉయ్యాల

No comments:

Post a Comment