Sunday, December 22, 2024

 *దేవుడు అడగని ప్రశ్నలు???*

మీ ఇంటిగదులు ఎంతవిశాలమైనవి అని దేవుడు అడగడు.

నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావు అని అడుగుతాడు.

నీది ఎన్ని అంకెల జీతం ? అని దేవుడు అడగడు.

నీ సంపదలో ఎంత నిజాయితీ వుంది?
అని అడుగుతాడు .

నీవు ఎంత గొప్ప పరిసరాలలో నివసిస్తున్నావు? 
అని అడగడు .

నువ్వు నీ ఇరుగుపొరుగు వాళ్లతో ఎలా మెలగుతున్నావని అడుగుతాడు .


నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనము చేస్తున్నావని దేవుడు అడగడు.

*నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు.*


నీ అలమరాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు.

నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చి చలి బాధ తీర్చావని అడుగుతాడు.

నువ్వెన్ని అధ్యాత్మిక గ్రంథాలు చదివావు అని దేవుడు అడగడు.

నీవు చదివిన పుస్తకాలలో నువ్వెంత సారాన్ని గ్రహించావు ? అని అడుగుతాడు .

నీవు ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు.

*నీవు ఎంత మానవ సేవ చేశావని అడుగుతాడు.*


నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్నిగడుపుతున్నావుఅని దేవుడు అడగడు.

ఇంకొకరికి సహాయపడటంలో 
ఎంత ఆనందముందో అనుభవించి మాటాడు అంటాడు .

ముక్తి పధమునకు ఇంత ఆలశ్యం చేశా వేమని దేవుడు అడగడు.
 
పైవన్నీ చేసిన వాడిని
నీవు రాగానే నీ చెయ్యి పట్టుకొని స్వర్గ ధామమునకు తానే తీసుకు వెళ్తాడు.
🙏
*యేలేశ్వరపు బాలసుబ్రహ్మణ్యం తాడిగడప విజయవాడ*

No comments:

Post a Comment