Tuesday, December 24, 2024

 *ధ్యానమార్గ*
శ్రేయాన్ స్వధర్మో విగుణ!' నా ధర్మం చెప్పుకోతగ్గంత గొప్పదనాన్ని కలిగి ఉండకపోయినా, “పరధర్మార్స్వనుష్ఠితాల్' ఇతరుల ధర్మాన్ని పోల్చి చూసినప్పుడు, అయినా కూడా ఎవరి ధర్మం వారే ఆచరించాలి. ఇక్కడ వ్యక్తిత్వాలను 
గురించి తెలియజేస్తున్నాడు. ఎవరి వేలుముద్రలు వారివే ఉంటాయి. అలాగే ఎవరి ధర్మం వారిదే. కొన్ని మానసిక ఉద్వేగాలు, ఇష్టాయిష్టాలు, నిర్ణయాలు అన్నీ
కలసి మానసిక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా ఏర్పడింది నీస్వభావం ఏదైతే
దానిలోనే ఉండు. సిగ్గు పడకు, ముడుచుకుపోకు. ఇతరుల నుంచి మంచిని
నేర్చుకోవచ్చు కానీ, వారినే అనుకరించడానికి ప్రయత్నించడం తప్పు. నీవు నీవుగానే ఉండు అని చెప్పడం వల్ల, నీ మీద నీకు నమ్మకం, దృఢ సంకల్పం, కలుగుతుంది. ఆ స్థితి నుంచే నిన్ను నీవు అభివృద్ధి చేసుకో. ఎవరో నిన్ను మూసపోసి తయారుచెయ్యడం లేదు. నీకు నీవే నిన్ను తయారు చేసుకుంటున్నావు. 'స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః! నీ ధర్మం నీకు
సౌకర్యంగా ఉంటుంది. వేరే వారి ధర్మం నీకు సరిపడదు. పరధర్మం భయాన్ని
కా' నీ ధర్మం
కలిగిస్తుంది.
❤️🕉️❤️
'పరతస్తు సః పర' సూక్ష్మమైంది. పర అనబడుతుంది,
ఘనీభవించిన వాటిని తాకి చూడవచ్చు. ఘన పదార్థంగా ఉన్న శరీరంకన్నా ఇంద్రియాలు కొంతవరకు సూక్ష్మమయినవి. ఘనీభవించిన దానిలో ఉన్న శక్తికన్నా, సూక్ష్మంలో ఉన్న శక్తి చాలా విలువయిందిగా ఉంటుంది. 'సూక్ష్మం మహాంతశ్చ' సూక్ష్మమయిన శక్తి అనంతంగా, విశాలంగా, శక్తిమంతంగా విస్తరించి ఉంది. • ప్రత్యగాత్మ భూతాశ్చ' నీలోని ఆత్మస్థితికి దగ్గరగా ఉంది. శరీరం భౌతికంగా నీకు కనబడుతుంది. ఇంద్రియాల జ్ఞానం కొద్ది సూక్ష్మంగా, మనస్సు ఇంకా సూక్ష్మంగా, బుద్ధి దానికి మించిన సూక్ష్మంగా, ఆత్మ వాటికి చాలా దూరంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది.
❤️🕉️❤️
ద్వైతం ఇంద్రియాల అవగాహన, అద్వైతం ఆత్మతత్త్వం, ముండకోపనిషత్తులో 'బ్రహ్మైవేదమ్ అమృతం' ఈ సృష్టి అంతా కూడా అనంత బ్రహ్మమయం, ముండకోపనిషత్తు పురస్తాత్ బ్రహ్మ' ముందు బ్రహ్మమే, 'పశ్చాత్ బ్రహ్మ' వెనుక బ్రహ్మమే 'దక్షిణస్తత్ ఉత్తరేణ బ్రహ్మైవేదం విశ్వం ఇదం వరిష్ఠం' కుడి, ఎడమవైపులన్ని వైపులా బ్రహ్మం తప్ప మరేమీ లేదు అని చెప్పింది. పూజింప తగిన బ్రహ్మ తప్ప మరేమీ కానరాదు. ద్వంద్వం మరేమీ కానరాదు. ద్వంద్వం లేని ప్రతిచోటకూడా పరిశుద్ధ చైతన్యస్థితే ఉంటుంది.           

No comments:

Post a Comment