Tuesday, December 24, 2024

 *భార్యా శ్రేష్ఠతమా సఖా*

*భార్య గొప్పదైన స్నేహితురాలు* ( *మహాభారతం* )

అపూర్వ నాగరికతతో ప్రపంచంలో ప్రప్రథమ సంస్కృతిని సాధించిన భారతీయధర్మం ఇప్పటికీ ఆ విలువలను పూర్తిగా కోల్పోలేదు. *స్త్రీ-పురుష సంబంధాలపై సనాతనధర్మం తపశ్శక్తితో గొప్పవ్యవస్థను ఏర్పరచింది.* 

ఆ ధర్మానికి మూలస్తంభం కుటుంబం. కుటుంబానికి మూలాధారం దాంపత్యధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురౌతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది.

*భార్యాభర్తల బంధాన్ని స్నేహబంధంగా నిర్వచించారు.* 

( " *ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చేయాలి. ధనరక్షణ, వ్యయాలపై ఆమెయే అధికారిణి*. గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ,
ధర్మంలోనూ, ఆహారంలోనూ ఆమెకే పూర్ణ అధికారం" -
అని మనుస్మృతి ఉపదేశం.)

“పురుషునకు దైవమిచ్చిన స్నేహితులెవరు?" - అని యక్షుడు ప్రశ్నిస్తే “భార్య”(భార్యా దైవకృతా సభా) అని సమాధానమిచ్చాడు ధర్మరాజు. ఈ స్నేహాన్ని చాటడానికే
*వివాహంలో 'సప్తపది' (ఏడడుగులు) మంత్రాలున్నాయి.* 

వివాహ మంత్రాలన్నీ దాంపత్యం అనేది ఒక 'సఖ్యం' అని స్పష్టీకరించాయి " *ఏడడుగులు వేసి నాతో స్నేహితురాలవై ఉండు. మనం ఎప్పుడూ స్నేహితులుగానే ఉందాం. నీ స్నేహమే నాకు లభించింది* నీ స్నేహం విడవలేను. నా స్నేహం వీడకు" - అని వివాహమంత్రాల భావం.

*“ధర్మార్థ కామాలలో నిన్ను అతిక్రమించను"(నాతి చరామి) అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు వరుడు.* 

అసలు “పరస్పర విరోధంగా కనిపించే ధర్మార్థ కామాలను సమన్వయపరచే శక్తి భార్యకే ఉంది"... అని మహాభారతం చెబుతోంది. అర్థకామాలు భార్య ద్వారా
నెరవేరడం వల్ల అధర్మ దోషం ఉండదు. ఇలా ధర్మంతో ఆ రెండూ కలిసి పురుషుని ఉన్నతుని చేస్తున్నాయి. ఈ లోతు తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ
పటిష్టపడి సవ్యమైన సమాజం సుప్రతిష్ఠితమవుతుంది.

యజుర్వేద మంత్రాలలో స్నేహధర్మం గురించి చెబుతూ - "స్నేహితునిగా భావించే వారిని పరిత్యజించరాదు. మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు. పుణ్యమార్గం అతనికి గోచరించదు” - అంటే ఇహపరాల్లో క్షేమం ఉండదని భావం.

( *కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ. అసలు దాంపత్య ధర్మం అనాది. సనాతనం* . ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడనీ, అదే
ప్రకృతీ-పురుషులనీ, ఆ అర్ధనారీశ్వరతత్త్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందనీ వేదం స్పష్టంగా పలికింది.)

*స్నేహబంధమైన దాంపత్యంలో దీనిని గుర్తుంచుకోవాలి.* 

*మనిషి తనని తాను ఎలా క్షమించుకుంటాడో, తనతో తాను ఎలా రాజీపడతాడో తన భార్య(భర్త)తోనూ అలాగే సహనశీలియై సఖ్యాన్ని కాపాడుకోవాలి.* కొన్ని భేదాలు
వచ్చినా శాశ్వత ప్రయోజనమైన ధర్మం కోసం, స్నేహనిబద్ధత కోసం సహనం వహించడం ప్రేమధర్మం.

“సామ్రాజ్ఞి శ్వశురేభవ” మూర్థానాం పత్యురారోహ”

- “నా గృహానికి నువ్వు సామ్రాజ్ఞివి,” “పతినైన నా శిరస్సుపై అధిష్ఠించు" - అని ఉత్తమస్థానంలో గౌరవించదగినది ఇల్లాలేనని వైదిక వివాహ మంత్రాల బోధన.

అర్థస్య సంగ్రహే పక్త్యాంచ పారిణాహ్యస్యచేక్షణే||

"ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చేయాలి. ధనరక్షణ, వ్యయాలపై ఆమెయే అధికారిణి. గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ, ధర్మంలోనూ, ఆహారంలోనూ
ఆమెకే పూర్ణ అధికారం" - అని మనుస్మృతి ఉపదేశం.

*స్త్రీకి ధనాన్ని ఆర్జించే వేదన ఉండరాదు - అని నిబంధించిన సంస్కృతంలోని ఉదారతని గ్రహిస్తే, “స్త్రీధనం కోసం ఆశపడే పురుషుడు అధముడు" - అని హెచ్చరించిన మన మహర్షుల వాక్కుల్ని గుర్తుపెట్టుకుంటే, పవిత్రమైన వివాహ వ్యవస్థలో వరకట్నపు అపశ్రుతులు వినబడనే వినబడవు.* 

కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ.

అసలు దాంపత్య ధర్మం అనాది. సనాతనం. 

ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడనీ, అదే ప్రకృతీ-పురుషులనీ,
ఆ అర్ధనారీశ్వర తత్త్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందనీ వేదం స్పష్టంగా పలికింది.
ఈ విషయాన్నే మనువు -

'ద్విధాకృత్వాత్మనో దేహమర్ధన పురుషో భవత్'
అర్ధేన తస్యాం సా నారీ విరోజ మసృజతే ప్రభుః॥ అని తెలియజేశాడు.

విశ్వనిర్మాణానికే మూలం దాంపత్యభావం. ఒకే పరతత్త్వం రెండయ్యింది. అలాగే స్త్రీ-పురుషభావం ఏకమవ్వాలి. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తుంది. ప్రకృతి నియయం పాలించబడుతుంది. అంటే - దాంపత్యధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం. భార్యాభర్తల అన్యోన్యత గురించి రాముడు చెప్పిన ఒక్క మాట చాలు

*"అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభా యథా” “సూర్యునికి వెలుగులా సీత నాకు అనన్య(వేరుకానిది)”.* దాంపత్యంలో ఔన్నత్యాన్ని తెలిపేది ఇంతకన్నా గొప్ప వాక్యం ఉంటుందా!

No comments:

Post a Comment