☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
51. నమస్తే అస్త్వాయుధాయ
భగవానుడా! నీ ఆయుధానికి నమస్కారం (యజుర్వేదం)
శాంతిప్రదాయకుడూ, నిర్మలుడు అయిన భగవంతుని చేతిలో ఆయుధాలు చాలా ఉన్నాయి. వాటికి నమస్కారాలు చెప్పింది వేదం.
ఆయుధాలు-శాంతీ... రెండూ పరస్పర విరుద్ధం కదా.... అనిపిస్తుంది మనకి.
ఇది పైపైన చూస్తే అనిపించేమాట. ఆయుధాలు హింసకి ప్రతీకలుగా భావించడం వల్ల అలా అనుకుంటాం. కానీ ఆత్మరక్షణ, దేశరక్షణ, ధర్మరక్షణ అనేవి జరగాలంటే 'రక్షణవ్యవస్థ' ఎలా ఉండాలో చెప్తున్నారు.
(క్షాత్రధర్మంలో ఉన్న నిగ్రహానుగ్రహసామర్థ్యం భారతీయ పాలనావ్యవస్థకి అనాది విధానం. దీనిని గ్రహించలేక ఆత్మరక్షణార్థంవినియోగించుకోవలసిన బలిమిని కూడా కాదనుకోవడం వల్లనే శత్రువుల రక్తదాహాన్ని ఎదుర్కొనలేని భీరుత్వం ఏర్పడింది. 'వీరత్వాన్ని' ఆరాధించిన సంస్కృతి దానిని హింసకు ప్రతిరూపంగా భ్రమపడడం వల్ల పరాయివారి హింసకు బదులు చెప్పలేని స్థితిలోకి వచ్చింది. )
శాంతి వచనాలు, వేదాంతబోధలు వైయుక్తిక జీవితానికి అవసరమే. వ్యక్తి మనస్సులో ప్రేమ, సమరసభావం, శాంతి ప్రతిష్ఠింపబడాలి. నిజమే. కానీ ఒకడు శాంతికాముకుడైనా చుట్టూ శాంతికాముకులే ఉంటారని చెప్పలేం.
కనుక శాంతికాముక దేశాలు సైతం పటిష్టమైన రక్షణవ్యవస్థను ఏర్పరచుకోవలసినదే,అదే క్షాత్రధర్మం అంటే. ఆత్మకు క్షతి(దెబ్బ) కలగకుండా ఉండేందుకు పటిష్టమైన
బలాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలి. వ్యక్తి వైరాగ్యం వల్ల స్వార్థం నశిస్తుంది.
అలాంటి త్యాగశీలతతో స్వధర్మం రక్షణార్థం బలాన్ని కలిగి ఉండడం,
సమయమాసన్నమైనప్పుడు శాశ్వత క్షేమం కోసం ఆ శక్తిని వినియోగించడం పాలనాధర్మం.
ఈ ధర్మాన్ని సనాతన వైదిక సంస్కృతి స్పష్టం చేసింది. అందుకే అహింసను
ప్రబోధించిన వేదమాత, అహింసను శాంతికీ అవరోధాన్ని కలిగించే హింసను ప్రతిఘటించే శక్తిని కలిగి ఉండమని ప్రబోధించింది ఈ హృదయమే పరమాత్ముని
నోట గీతానాదమై కిరీటిని ఆయుధగ్రహణకు పురికొల్పింది.
అయితే ప్రతిదానికీ పరిఉమీలూ, పరిమితులూ ఉంటాయని కూడా గ్రహించి వాటిని స్పష్టం చేసింది వేదజనని. సామ-దాన-భేద దండోపాయాలను క్రమపద్ధతిలో
ఏర్పరచింది. సాత్త్వికమైన నిగ్రహణాన్ని చేతకానితనంగా భావించే పరిస్థితిని తెచ్చుకోకూడదని శాసించింది. ధర్మంలో ఎంత సాత్త్వికమైన సౌమ్యత, సౌజన్యం
ఉంటాయో, అధర్మాన్ని శిక్షించడంలో అంతటి కాఠిన్యం ఉంటుంది. ఈ విషయంలో శ్రీరాముడే మనకు ఆదర్శం.
ఈ క్షాత్రధర్మంలో ఉన్న నిగ్రహానుగ్రహసామర్థ్యం భారతీయ పాలనావ్యవస్థకి అనాది విధానం. దీనిని గ్రహించలేక ఆత్మరక్షణార్థం వినియోగించుకోవలసిన బలిమిని
కూడా కాదనుకోవడం వల్లనే శత్రువుల రక్తదాహాన్ని ఎదుర్కొనలేని భీరుత్వం ఏర్పడింది.'వీరత్వాన్ని' ఆరాధించిన సంస్కృతి దానిని హింసకు ప్రతిరూపంగా భ్రమపడడం వల్ల పరాయివారి హింసకు బదులు చెప్పలేని స్థితిలోకి వచ్చింది.
స్వధర్మ రక్షణకీ, దేశసౌభాగ్యానికీ అవక్ర, పరాక్రమస్ఫూర్తి కలిగిన భారతవీరుల కారుణ్య సౌజన్యాలలో రసస్వరూపులు అనే విషయాన్ని ఋజువుచేసే బలిష్టమైన
వ్యవస్థని రూపొందించుకోగలగాలి.
No comments:
Post a Comment