Monday, December 23, 2024

 అత్యుత్తమ ఉదాహరణ భగవద్గీత గురించి..🙏🙏🙏** వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయో2వ్యవసాయినామ్ ॥**

ఈ నిష్కామ కర్మ యోగమును అవలంభించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా, నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని దాని కొరకు కర్మచేస్తే వాడి బుద్ధి పరి పరి విధాల పోతుంది. కుదురుగా నిశ్రయంగా ఉండదు.

ఆధ్మాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవము మీద నిశ్చయమైన బుద్ధి ఉండాలి. ఆ దేవుడు మంచి వాడు, ఈ దేవుడు మనకు కోరిన వరాలినుడు అనే భేదభావము ఉండకూడదు. అలాగే శ్రయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా, విజయవంతంగా చేస్తాడు. ఏ పని చేస్తున్నా మనసు దైవము మీద నిలిపి ఉంచుతాడు. ప్రాపంచిక విషయములను ఎక్కువగా పట్టించుకోడు. ఒక లక్ష్యము అంటూ లేని వాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ముళ్లపొద మీద తీగ పాకినట్టు అడ్డదిడ్డంగా పాకుతుంది. ప్రపంచంలో దొరికే అన్ని వస్తువులమీదికి మనసు పోతుంది. వాటి కోసం వెంపర్లాడుతుంది. ఉదాహరణకు సూర్యకిరణములను భూత అద్దంలో నుండి ప్రసరింపజేస్తే, అవి ఏకాగ్రత చెంది దేనినైనా భష్మం చేస్తాయి. అదే సూర్యకిరణములు విడి విడిగాఉంటే ఆ పని చేయలేవు. కాబట్టి మానవునికి ఏకాగ్రబుద్ధి అవసరము.

No comments:

Post a Comment