*ధ్యానమార్గ*
శ్రీరామకృష్ణ పచ్చి కొబ్బరికాయ, ఎండు కొబ్బరి కాయతో పోల్చి చెప్పారు. ఎండు కొబ్బరికాయ టెంకకు దూరం అయి ‘కడ కడు' శబ్దం ఎలా వస్తుందో ఆ విధంగానే మనస్సు ప్రపంచ విషయాలకు దూరం కావచ్చు. ఇది అన్ని పనులకు వర్తిస్తుంది. మరీ ఈ ఆధునిక సాంకేతిక కాలంలో పనిని
బంధంతో చేస్తే ‘ రక్తపోటు' మొదలయినవి వస్తాయి. అదే పనిని బంధం లేకుండా చేస్తే ఎంత పనైనా చెయ్యడానికి వీలుంటుంది. గీత ' బందీ", బందీవి
కాకుండా అన్నది ఎక్కువసార్లు తెలియజేస్తుంది.
❤️🕉️❤️
చాలా తెలివిగలిగి, ధీరునిగా ఉండడం మహాపురుషుని లక్షణాలు, ధీరుడు అన్నది సంస్కృతంలో పదం, ధీరునిగా ఏవిధంగా ఉంటాడు? ప్రజలు పొగడినా, నిందించినా, సంపదకలిగినా, సంపదపోయినా, మరణం ఇప్పుడు వచ్చినా, లేక ఒక యుగం అయినాక వచ్చినా, ధీరులు న్యాయం నుంచి ఒక్క అడుగుకూడా ఆవలికి వేయరు. వారు ఆకర్షణలకుగాని, భయానికి గాని లొంగరు. సమాజంలో అటువంటి లక్షణాలు పెరగాలి.
❤️🕉️❤️
"ఉత్తిష్ఠత జాగ్రత ప్రావ్యవరాన్ నిబోధత' అని కఠోపనిషత్తులో
చెప్పబడింది. దైవాన్ని చేరేవరకు నీ లక్ష్యం సిద్ధించేవరకూ ఎక్కడా ఆగవద్దు అన్నదే దాని అర్థం. మన అందరిలోనూ ఒకే దైవముందన్న జ్ఞానం తప్పక వస్తుంది. జీవితంలో మనముందు గొప్ప ఆశయాన్ని ఉంచుకోవాలి. మన
ఆశయాలను చిన్న చిన్న ఆశయాలు, పెద్ద ఆశయాలుగా విభజించవచ్చు. నిత్య జీవితంలో ఎన్నో చిన్న చిన్న ఆశయాలు నెరవేరుతుంటాయి. అవి మామూలే.
అయితే నీవు ఏ విధంగా మారావు? నీవు ఏమి అయ్యావు? నీవు ఏ పరిణామానికి చేరుకున్నావు అన్నదే ముఖ్యం
❤️🕉️❤️
పరిశీలించతగినదేదైనా విజ్ఞానశాస్త్రం అవుతుంది. కేవలం నమ్మడమే కాక పరిశీలించి తెలుసుకోవచ్చు. గీత అనేక పరిశీలించిన సత్యాలను, పరిశీలించు కోవడానికి వీలుగా తెలియజేస్తుంది. కొంతవరకు ప్రయత్నించి చూడు. పనిని
ఇంద్రియాల ద్వారానే నిర్వహిస్తూ, మనస్సుపై ఏ విధమైన ముద్రను పడనీయకుండా నిర్వహించడమే అహంకార నిర్మూలన చేసుకున్నట్లు. నేను కాదు, నాలోని దైవమే అంతా అన్న నిర్వచనగా వ్యక్తి ప్రవర్తించాలి. బ్రహ్మం నుంచి వచ్చినవి. బ్రహ్మమునే చేరతాయి, నేనుగా ఏమి చెయ్యడం లేదన్న సత్యంలోనే ఎల్లవేళలాఉండాలి.".
No comments:
Post a Comment