Friday, August 1, 2025

 *🕉️🙏'ఓమ్' 🕉️🙏*

🕉️🙏
*'బింబ, ప్రతిబింబ రహస్యం.'*
🕉️🙏
*బింబానికి అద్దం*
*ఉంటే ప్రతిబింబం,*
*బింబం లేకుంటే*
*ప్రతిబింబం ఉండదు,*
*బింబం, అద్దం ఉన్నా*
*వెలుగు అవసరం,*
*వెలుగు లేకపోతే*
*ప్రతిబింబం ఉండదు.*
🕉️🙏
*బింబం, అద్దం, ప్రతిబింబం తాత్కాలికం,*
*వెలుగు మాత్రమే శాశ్వతం.*
🕉️🙏
*బింబంతో అద్దం,*
*ప్రతిబింబాన్ని వదిలి,*
*శాశ్వతమైన*
*వెలుగును*
*పట్టుకోవాలి.*
🕉️🙏
*ఆత్మతో ప్రకాశిస్తున్న*
*జీవుడే బింబం,*
*మాయతో కూడిన*
*ప్రపంచమే అద్దం.*
🕉️🙏
*నామ, రూపాత్మక*
*దేహమే ప్రతిబింబం,*
*శాశ్వత వెలుగుతో*
*ఉన్న*
*బింబాన్ని వదిలి,*
*తాత్కాలిక అద్ధం,*
*ప్రతిబింబాలతో*
*సుఖదుఃఖాలు*  
*తప్పవు.*
🕉️🙏
*శాశ్వతానందం కోసం*
*బింబంగా ఉన్న*
*జీవుడు*
*వెలుగు( జ్ఞానం)*
*వైపు వెళ్ళాలి.*
🕉️🙏
*వెలుగు వదలొద్దు.*
*వెలుగే ఆనందం,*
*వెలుగులోనే ఉంటే*
*ఆనందం లభిస్తుంది !*
*ఆనందమస్తు !*

*🕉️🙏'ఓమ్' 🕉️🙏*

No comments:

Post a Comment