Saturday, August 9, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

           *ఆచార్య సద్బోధన*
               ➖➖➖✍️```

ఓం నమో భగవతే వాసుదేవాయ

కాలం వల్లనే అన్ని అవస్థలూ కలుగుతాయి. నరుడు కాల మహిమను గమనించలేక అప్పుడప్పుడు జరిగే హఠాత్ సంఘటనను చూసి, ఇంతకు ముందు చూశానే బాగానే ఉన్నాడే ఇంత త్వరగా పోయాడే అని ఇతరుల గురించి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాడు. అతడి మనస్సులో వివేకం లేదు కనుక అలా భావిస్తున్నాడు తప్ప అటువంటి సంఘటన తనకూ ఎంతో దూరంలో లేదన్న ఆలోచన పొరపాటున కూడా అతడికి రాదు.

కాలతత్త్వాన్ని తెలుసుకోవాలి. కాలగతిని గ్రహించటం మూలంగా మనశ్శాంతి లభిస్తుంది. మనస్సుకు తాను ఆత్మయే కానీ, శరీరం కాదు అనే ఆత్మమయ భావనను బాసటగా అందిస్తుంది. ఆ భావనను పొందిన నరుడు క్షోభకు గురికాడు.

కనుక నరుడు దుర్దశ ప్రాప్తించినప్పుడు క్రుంగిపోకూడదు. ధైర్యంగా ఉండాలి. ఇదంతా కాల స్వరూపమనే జ్ఞానాన్ని కలిగి ప్రవర్తించాలి.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment