Tuesday, August 5, 2025

 *🕉️🙏'ఓమ్' 🕉️🙏*

*'సదాశివ సమారంభాం*
*శంకరాచార్య మధ్యమాం*
*అస్మదాచార్య పర్యంతాం*
*వందే గురు పరంపరాం'* 
🕉️🙏

🕉️🙏
*ఇది సంస్కృతంలో*
*'జగద్గురుఆదిశంకరాచార్యులచే'*
*స్వరపరచబడినది.*
 🕉️🙏

🕉️🙏
*'భజ గోవిందం' (మోహ ముద్గరః )*
🕉️🙏

యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీనః ।
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ॥ 
🕉️🙏

*🕉️🙏భావం🕉️🙏👆👇:*
*ఒకడు యోగిగా* *జీవించవచ్చు,*
*భోగిగా జీవించవచ్చు,* 
*ఈ ప్రపంచంలో*
*అందరితో కలిసి మెలిసి*
*జీవించవచ్చు లేదా*
*ఏకాంతముగా*
*అందరికీ దూరంగా* *జీవించవచ్చు.*
*కాని ఎవరైతే*
*తమ మనసును* *బ్రహ్మతత్వమునందే*
 *నిలిపి తమను తాము*
*బ్రహ్మగా భావిస్తూ*
*ఉంటారో అట్టివారే*
*ఆనందిస్తారు.*
*ముమ్మాటికీ*
*అట్టివారికే ఆనందం.*
🕉️🙏

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ ।
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ll
🕉️🙏


*🕉️🙏భావం:👆👇* *సత్పురుషులతో* *సాంగత్యం  చేయడం వల్ల*
*ఈ ప్రాపంచిక*
*విషయాల మీద*
*సంగభావం*
*తొలగిపోతుంది.*
*దానివల్ల క్రమంగా*
*మనలో ఉన్న భ్రమ*
*లేదా మోహం*
*తొలగిపోతుంది.* *మోహం పోతే*
*మనసు పరమాత్మ*
*మీద చలించకుండా*
*నిలిచిపోతుంది.*
*అప్పుడు*
*సకల కర్మ బంధనాల* *నుంచి విముక్తి*
 *లభిస్తుంది.*
*జీవించి ఉండగానే*
*'ముక్తి'*
*లభిస్తుంది* 
*అదే 'మోక్షం',*
*'జీవన్ముక్తి'.*
🕉️🙏

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనమ్ ।
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాఽపారే పాహి మురారే ॥
🕉️🙏
 
*🕉️🙏భావం:🕉️🙏👆👇*
*మళ్ళీ మళ్ళీ పుట్టడం,*
*మళ్ళీ మళ్ళీ చావడం,*
*మళ్ళీ మళ్ళీ తల్లి*
*గర్భంలో ప్రవేశించి* *అక్కడ ఉండడం*
*ఈ అంతులేని*
*సంసార జనన మరణ*
*చక్రబంధం నుండి* *తప్పించుకోవడం*
*కష్టమైన పని.*
*కనుక ఓ పరమాత్మ ❗* 
*దయచేసి*
*మమ్ములను రక్షించు.*
🕉️🙏



*🕉️🙏'ఓమ్' 🕉️🙏*

No comments:

Post a Comment