*గాజు కనులకు వారు ఊహించిన రూపములో నేను కనిపించలేదని నన్ను నమ్మని వారు ఎందరో...*
*కానీ జ్ఞాన చక్షువులకు కనపడతానని ఎరుగరు. పిలిచినంతనే పలుకలేదని అడగగానే సమాధానం ఇవ్వలేదని నిందించే వారు ఎందరో!*
*కానీ ఇంకనూ సమయము ఆసన్నము కాలేదని సందర్భం రాలేదని గ్రహించలేరు. ఆపదలలో, అవసరాలలో ఆదుకోలేదని అలిగిన వారు ఎందరో కర్మ ఫలితాన్ని కొంతైనా అనుభవించక తప్పదని తెలుసుకోలేరు.*
*కోరికలు తీర్చలేదని అడిగినవన్నీ అందించలేదని కోపగించుకున్న వారు ఎందరో*
*కానీ అర్హత లేని కోరికలు తీర్చనని లేదా అవి శ్రేయో దాయకం కాదని గ్రహించలేరు. పసి పిల్లలు అడిగినవన్నీ ఇస్తారా?ఇవ్వలేదంటే ప్రేమ లేదని కాదు వాత్సల్యం లోపించిందని కాదు?*
*నిరంతరము వారి శ్రేయస్సు నా బాధ్యత! ఒక జన్మలో కాదు జన్మ జన్మలలో... ఈ కనులతోనే నన్ను చూడవచ్చు ఆ చేతులతోనే నన్ను తాకవచ్చు అంతులేని ఆర్తి ఉంటే చెదిరిపోని నమ్మకం ఉంటే ప్రతి* *స్వాసలో నన్ను నమ్మితే నేను తప్ప నువ్వు లేవనే స్థితిలో ఉంటే ఇది ఎరిగినవారి హృదయాలలో నేనే నిలచి ఉంటాను.*
*🔱శివోహం శివోహంశివోహం🔱*
No comments:
Post a Comment