అమెరికాకు చెందిన ఒక ప్రొఫెసర్ వారణాసిలోని మరొక ప్రొఫెసర్ సహాయంతో ఒక పరిశోధన చేసాడు.
"శివపురాణం" లోని "కాశీఖండం" లో ఉన్న సూర్య దేవాలయాల ప్రాశస్త్యం ఉంది. అందులో చెప్పినట్టు భారతదేశంలోని ఆయా ప్రదేశాల్లో సూర్యదేవాలయాలు ఉన్నాయా లేవా, గ్రంధంలో సూచించిన విధంగా ఆయా సమయాల్లో ఆ దేవాలయాలు సూర్య శక్తిని పొందుతున్నాయా లేదా అనే అంశంపై పరిశోధనలు చేసి నిజాలు గ్రహించి ఒక బుక్ వ్రాసాడు.
సూర్యుడు ఒక్కొక్క రాశిలో పయనిస్తూ ఒక్కొక్క సూర్య దేవాలయంపై తన కిరణాలను నిట్టనిలువుగా ప్రసరింప చేస్తున్నాడని, ఆ సమయంలో సదరు దేవాలయం సూర్య శక్తిని పొందుతుందని, ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉండి కూడా
మనం చేయలేని పని అంటే 12 రాశులలో ఏయే 12 ప్రాంతాల్లో సూర్యకాంతి నిట్టనిలువుగా ప్రసరించి శక్తిని గ్రహించాహగలుగుతాయో అంత ప్రాచీన కాలంలోనే ఎలా తెలుసుకొని వీటిని నిర్మించారని ఆశ్చర్యపోయాడు.
పుష్కరాల ప్రాశస్త్యం కూడా ఇలాంటి సైన్సే. తెలియక మూర్ఖులు తప్పుపడుతుంటారు.
No comments:
Post a Comment