🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*శతృఘ్నుని భాతృభక్తి...!!*
➖➖➖✍️
```
శ్రీ రాముడు అయోధ్యారాజ్యాన్ని పాలిస్తున్న కాలంలో లవణాసురుడనే రాక్షసుని బాధలు భరించలేక ఋషులు,మునులంతా వెళ్ళి శ్రీరాముడి వద్ద రక్షణకోసం
మొరపెట్టుకుంటారు.
లవణాసురుని సంహరించే బాధ్యత ఎవరికి అప్పగించాలనే చర్చ జరుగుతున్నప్పుడు శతృఘ్నుడు ముందుకు వచ్చి శ్రీ రాముని తో
“ఆ రాక్షసుని వధించే కార్యాన్ని తనకివ్వమ”ని కోరుకుంటాడు.
రామచంద్రుడు వనవాసంలో వున్నంతకాలం సోదరుడైన భరతుడు కూడా జటాధారియై, ధర్భలపై శయనించి,కందమూలాలను మాత్రమే తింటూ దీక్షగా జీవించాడు. అందువలన భరతునికి యీ భాధ్యత ఆప్పగించడం భావ్యం కాదు.
కనుక , తానే లవణాసురిని సంహరించేందుకు అనుమతి ని యివ్వండని
కోరాడు.
శ్రీ రాముడు ఆ బాధ్యతను శతృఘ్నునికి
అప్పగించాడు.
శతృఘ్నుడు లవణాసురిని సంహరించి
వస్తాడు .శ్రీ రాముడు అతనిని మధురా నగర రాజ్యాన్ని పరి పాలించమని ఆదేశించగా
“నా కంటే పెద్దలు వుండగా నా కేల యీ రాజ్యభారం. వద్దని తిరస్కరిస్తాడు
శతృఘ్నుడు.
అంతేకాదు, పదునాలుగు
సంవత్సరాలు శ్రీ రాముని
వియోగ దుఃఖమును పొందిన నాకు మరల ఈ రాచరికంతో యీ వియోగాన్ని కలిగించ వద్దని ప్రాధేయపడుతూ
"తల్లి లేని శిశువు వలె నిన్ను విడచి ఒక్క క్షణమైనా గడపలేనని
విలపిస్తాడు.
ఈ సంఘటన ద్వారా శ్రీరాముడి సోదరులెంత భాతృభక్తి పరాయణులో ,
శతృఘ్నుని భాతృ భక్తి
యెంతటి వున్నతమైనదో బోధపడుతున్నది.
దశరధ తనయులంతా సోదరప్రేమలో ఒకరిని మించిన వారు మరొకరు.
భాతృ ప్రేమ వారి జీవిత
పరమాశయం.
భాతృ భక్తి
వారి జీవిత లక్ష్యం.వారి
సత్య ధర్మ త్యాగాలే
వారిని చరిత్ర నాయకులను చేశాయి.
శ్రీ రామ సోదరుల
జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుంటే నేటి సమాజంలో సోదరుల మధ్య
ఏర్పడుతున్న అగాధం
కొంత వరకూ తగ్గుతుంది.
నిస్స్వార్ధ ప్రేమ వృధ్ధి చెంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, బంధాలు, అనుబంధాలు బలపడతాయి.
..స్వస్తి...✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment