*@ బందీలం కావద్దు..! @40
తేది: 04/08/2025
""""""""""""""""""""""""""""""""""""""
'మనసా తుళ్లిపడకే...అతిగా ఆశ పడకే'
అన్నారో సినిమా
కవి నిజంగానే మనిషి మనసుకు ఆశకన్నా అత్యాశ
ఎక్కువ క్షణం కుదురుగా ఉండదు రకరకాల ఆలోచనలు
చేస్తూ ఉంటుంది ఒక చిన్న సానుకూలాంశం కనపడగానే
ఊహల్లో మేడలు కట్టేస్తుంది పరిస్థితి కాస్త అటూ ఇటూ
అయిందంటే అమాంతం అధఃపాతాళంలోకి తొక్కేస్తుంది
మనసు కోతిలాంటిదని ఊరికే అనలేదు అది ఎప్పుడెలా
ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు ఎంతో కాలంగా
ఇష్టపడుతున్న మనిషికి ఎలాగైనా మనసులోని మాట
చెప్పేయాలని నిర్ణయించుకునేలా ప్రోత్సహిస్తుంది కాసేపు, తీరా
అక్కడికి వెళ్లేసరికి
'నీ వల్ల కాదులే'' అని వెనక్కి లాగేసేదీ
అదే నవ్విస్తుంది, కవ్విస్తుంది ఏడిపిస్తుంది ఎప్పుడూ ఏవిషయంలోనూ స్థిరంగా ఉండదు,మనల్ని ఉండనివ్వదు
మన భావోద్వేగాలన్నీ మనసు తాలూకు చేష్టలే మనుషులు
ఎప్పుడూ అయితే గతం గురించి, లేకపోతే భవిష్యత్తు గురించి
ఆలోచిస్తుంటారు వర్తమానం గురించి అసలు పట్టించుకోరు
అంటాడు డేల్ కార్నెగి నిజమేగా మరి...
ఈ కోర్సులో
చేరకుండా ఉండాల్సింది, కాస్త కష్టమైనా ఆ ఉద్యోగం కోసం
ప్రయత్నించి ఉండాల్సింది, ఫలానా సంబంధం
చేసుకోవాల్సింది...
చేతులు కాలాక ఇలా ఆలోచనల్లో ఆకులు
పట్టుకుంటూ ఉంటారు చాలామంది ఇక కలల రాణులూ
రాకుమారుల సంగతి చెప్పనే అక్కర్లేదు వీళ్లెప్పుడూ రేపటి
రోజున కట్టే కోటల గురించి మాటలు చెబుతారు తప్ప ఇవాళ
చేస్తున్న పనిలో మాత్రం మనసు పెట్టరు
సగటున రోజుకు ఏడు వేల నుంచి డెబ్భైవేల ఆలోచనలు
చేయగల సత్తా ఉందట మనిషి మనసుకు అందుకేనేమో
సృష్టిలో అన్నిటికన్నా వేగవంతమైంది మనసేనన్నారు
యక్షప్రశ్నల్లో జీవితం అన్నాక మంచీచెడూ,కష్టం సుఖం,
ఆనందం విచారం
అన్నీ ఉంటాయి... కాబట్టి వచ్చే
ఆ వేలాది ఆలోచనల్లో సానుకూలమైనవీ ఉంటాయి,
వ్యతిరేకమైనవి ఉంటాయి కూరగాయల్లో చచ్చుపుచ్చులన్నీ
ఏరి అవతలపడేసినట్లు పనికిరాని పిచ్చి ఆలోచనలను
అవతలికి తరిమేయాలి దేన్నయినా తట్టుకోవాల్సింది ఒకటే
మనసు దాన్ని చీటికీ మాటికీ చిన్నబుచ్చుకోనీయకుండా
దృఢంగా ఉండేలా మలచుకోవాల్సింది మనమే మనోనిబ్బరం
ఉన్నవాళ్ళు కొండలనైనా పిండి చేయగలరని గుర్తుంచుకోవాలి
ఓడిపోతే మరచిపోదు, గాయమైతే మాసిపోదు అని
పాడుకోడానికి బాగుంటుంది కానీ జాలిపడి దాన్ని అలాగే
ఉండనిస్తే జీవితాన్ని నరకప్రాయం చేసి వదిలిపెడుతుంది
అందుకని మనసు గతి ఇంతేననుకోకుండా దాన్ని మన
అదుపులో పెట్టే ప్రయత్నం బలంగా చేయాలి
చేస్తున్న
పనిలో లగ్నం చేయాలి నూటికి నూరుపాళ్లు మనసు పెట్టి
వర్తమానానికి న్యాయం చేయగలిగితే గతం మన జోలికి
రాదు, భవిష్యత్తు భయపెట్టదు కంటికి కనిపించని, చెవులకు
వినిపించని మనసు చేసే గందరగోళానికి మనం
బందీలం కాకూడదు...!*
No comments:
Post a Comment