Saturday, August 9, 2025




*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 మహర్షి :_*
*_ప్రతీ తలంపుకూ మూలాన్ని వెదుకు.. తలంపు పుట్టు స్థానం కనుక్కో అది మనస్సే._*

*_ధ్యానంలో అలా 'నేను'ను వెదుకు. 'నేను ఎవరో వెదుకు._*
*_ఎప్పుడూ ఏ తలంపునూ ప్రవర్తింపనీయకు. వాటికి స్పందిస్తే, అంతం ఉండదు._*

*_ప్రతీ తలంపును వాటి పుట్టుస్థానం మనస్సుకే మళ్ళీ మళ్ళీ ప్రతిసారి స్పందించకుండా ప్రశ్నించి తీసుకునిపో._*

*_అపుడు ఆ తలంపు, మనసూ, రెండూ, ప్రశ్నలు నిరాసక్తత వలన లేకుండా నశిస్తాయి._*

*_మనసు తలంపుల రూపంలోనే మనగలుగుతుంది._*
*_తలంపులు పోతే, నాశనమైతే, ఇక మనసు అన్నది లేనేలేదు._*

*_సందేహం, నిస్పృహ కలిగినపుడెల్లా 'ఈ సందేహించే వాడెవరు ? నిస్పృహ కలిగినదెవరికి ?' అని ప్రశ్నించి వెదకి విచారణ చెయ్. ప్రతీసారీ నిరంతరంగా స్థిరంగా ఈ ప్రశ్నకే వెళ్ళు. ఈ 'నేను' ఎవరు ? అది ఎక్కడ నుంచి ? మూలమైన ఆధారం తప్ప ఇంకేమీ లేకుండా_*
*_మిగలకుండా చింపి, చింపిపారెయ్. అదే నువ్వు. అపుడు వర్తమానంలోనే జీవించు. దానిలో మాత్రమే ఆనందించు. ఇక మనసులో ఏదీ, భారమై భావించే గతంగానీ, భవిష్యత్తు గానీ లేవు. ఉండవు. వర్తమానం మాత్రమే. అదే నీ సహజస్థితి. సర్వశక్తివంతం, చైతన్యం, పరమానందమే అయినది._*

*_తలంపులను కేంద్రం మూలానికి తీసుకుని పోతున్నపుడు, మనస్సులో నిండి ఉన్న ఎన్నో వివిధ రకాల తలంపుల మహాసాగరాన్ని మధించినట్లే ఉంటుంది._*

*_నువ్వు మనస్సును తన మూల స్థానంలోనికి మరల్చి నిలిపినపుడు, ఇనుపరజమును అయస్కాంతము ఆకర్షించినట్లు, నీలోని ఆత్మచైతన్యము తన శక్తితో ఆ మనసును తనలోనికి గుంజుకుంటుంది. అపుడు ఆ మనస్సు ఎరుకలో, హృదయంలో కలసిపోతుంది. దాని తరువాత మనసు వేరుగా లేవడం జరుగదు._*

*_శుద్ధమైన మనసుకు కూడా సాధారణ ఇంద్రియ శక్తులు, జ్ఞాపకం, విచక్షణ, తర్కం అన్నీ ఉంటాయి. తేడా ఏమిటంటే, అవన్నీ అహంకారపూరితంగా కాకుండా ఆత్మగానే ఉంటుంది. తలంపుల భారం లేకుండా వర్తమానంగానే ఉంటుంది. ఎప్పుడూ అలానే ఉంటుంది._*

*_అలాంటి మనసు ఎప్పుడూ ఏది అవసరం అయితే అంతవరకు స్పందిస్తుంది. పరిపూర్ణంగా పూర్తిగా ప్రవర్తిస్తుంది. శుద్ధ నిర్మల మనసు అంటే ఆత్మ (నేను) వలననే అన్నీ చేయడం, మాట్లాడడం, స్పందన, ప్రవర్తన జరుగుతుంది. మనసు మలినాలు, ఎన్నో విధాల అస్థిర గుణాల నుండి విముక్తి పొందుతుంది._*

*_ఆత్మలోనే నిలచి ఉంది కాబట్టి ఆ మనసు బ్రహ్మానందం అనుభవిస్తూంటుంది. దేశకాలాల కతీతంగా సదా ఉంటుంది. వర్తమానం అంటే 'ఇక్కడ' 'ఇప్పుడు'. ఇవి అన్నిచోట్లా అన్నికాలాల్లో ఉంటాయి._*

*_అంటే ప్రదేశానికి, కాలానికి అతీతం. అంటే ప్రదేశం కాలం లేనివే శుద్ధ మనసుకు. ఉన్నదంతా సత్ (నువ్వు/నేను), దాని అఖండ శాంతం, మౌనం, బ్రహ్మానందం, అనంత చైతన్యం !!._*
                  *_అరుణాచల శివ_*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_*

No comments:

Post a Comment