Friday, January 2, 2026

 "కొత్త వత్సర కాలమా.. ఓ కరవాలమా! 

పట్టపగ్గాలు లేని అందరి పరుగుల
సమస్తాన్ని  నీ చూపులో మోస్తున్నావు
నీకునీవే సమస్తమని తిరుగుతున్నావు. 
పట్టుకొల్పోయి పడిపోతున్న 
ఈ లోకాన్ని చూసి నవ్వుతున్నావు..
ఏమిటి  నీ లీల? ఎవరికి అర్థం కావు. 

అన్ని విలువలు జారిపోతున్నా పట్టించుకోవు
నీకాళ్ళ కింద పడి నలిగిపోతున్న 
బతుకులను చూడవు. అన్నీ కోల్పోతున్నా ఎందరో జీవితాలు ఇంకా ఎండమావుల ఎరుకలోనే ఉన్నారు. బతుకును సార్దకం చేసుకునే భరోసా లేదు. ఈ వ్యవస్థను ఏలే సర్వాంతర్యామివి నీవు. కాలం తోనే  ముడిపడిన మా జీవితాలు కాలంతోనే విడిపోయే మా బతుకులు చివరికి కాలంలోనే కలిసిపోయే మా ప్రాణాలు అన్నీ నీవే! అంతా నీవే! నీతోనే ఆనందం నీతోనే అంతం. 

అందుకే ఈ లోకానికి నీవే కొత్త వత్సరం
యుగాలు గడిచిపోతున్న నీవు మాత్రం
మాకు కొంగ్రొత్త సంత్సరంగా వస్తుంటావు
మా బతుకు గీతాల్ని వింటుంటావు. 

నీవు మాకిచ్చే మహాప్రసాదం ఏమంటే
మా బతుకుల్లోని  అపశ్రుతులన్నీ తొలగించు
సమస్త లోకానికి నిజమైన సత్యానివ్వు! 
మాలోని నిరుత్సాహాన్ని జయించే శక్తినివ్వు
మాఊహల్లో ప్రశ్నలు మా ఊపిరిలో నిట్టూర్పులు నిత్యం మిణుకు మిణుకు మనే ఆశలు అంతర్గత మానసిక కలతలు జయించ గలిగె జీవితాన్ని ఇవ్వుT JK NAIDU

No comments:

Post a Comment