*_నూతన సంవత్సరం అంటే..._*
క్యాలెండర్ కొత్త రూపు..
ముందు రోజు రాత్రి
కొంత ఊపు..
కాసింత కైపు..
ఇంటికి వచ్చే వరకే
నువ్వు తోపు..
వచ్చాక ఓ తాపు..
తీరిపోయే తీపు..!
ఇప్పటికి గడిచినవి 2025..
మిగిలిన లెక్క
నీకూ నాకూ
అందేది కాదు..
ఉన్నంతవరకే
ఈ లెక్కల చిక్కు..
మూన్నాళ్ళ జీవితం కోసం
ఎందుకంత పుర్రాకు..!
ఓ 365 పోక..
మరో 365 రాక..
నిరుటి లాభనష్టాలు..
రేపటి కష్టసుఖాలు..
ఆడిటరే అవసరం లేని
అకౌంటింగ్..
ఏయేటికాయేడు
జీవితం డిటో..
బ్యాలెన్స్ షీట్ సూమోటో..!
నువ్వు చేసే మంచి..*క్రెడిట్..*
చెడు *డెబిట్..*
సరిపెట్టకు ఆ లెక్క..
క్రెడిట్ ఎక్కువుంటే బెటర్..
లేదంటే చిత్రగుప్తుడి చిట్టాలో
తేలిపోయే మ్యాటర్...!
గడచిన ఏడాదిపై చేస్తే
సింహావలోకనం..
తప్పులు చేసి ఉంటే దిద్దుకో..
మళ్లీ చేయకుండా చూసుకో
ఒప్పులే చేస్తే
మరిన్ని ప్లాన్ చేసుకో..
నువ్వు చేసే మంచి
నిన్ను కాచే కంచె...!
💐💐💐💐💐💐💐💐
నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
*_సురేష్ elisetty_*
9948546286
7995666286
No comments:
Post a Comment