నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖
*గు అనగా చీకటి! రు అనగా నశించడం. అజ్ఞానం అనెడి అంధకారమునుండి జ్ఞానమనెడి వెలుగులోకి నడిపించేవాడే గురువు.
*తల్లి దండ్రులు తమ పిల్లల్ని బయట ప్రపంచానికి పరిచయం చేస్తే, గురువు పిల్లలను తమ అంతరంగాన్ని పరిచయం చేసి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి వారిని జ్ఞానవంతులుగా, ఆదర్శవంతులుగా, సేవకులుగా, నాయకులుగా తయారు చేస్తాడు.
*కనుకనే సమాజములో గురువుకు ప్రత్యేకమైన స్థానం దక్కింది.
*అయితే నేటి పరిస్థితులు పూర్తి భిన్నం. గురువుకు సరిఅయిన గౌరవము దక్కని చోట జ్ఞాన ప్రకాశానికి చోటులేదు.
*గురువులను అపహాస్యము చేసినవారు, గురువులను చిన్న చూపు చూసేవారు దైవము దృష్టిలో కూడా అపహస్యం చేయబడతారు, చిన్నచూపు చూడబడతారు.
*అయితే గురువు కూడా పేరుకు తగ్గట్టుగా శాంతంగా ఉండాలి. మంచి వేషం (డ్రెస్సింగ్) ధరించాలి. సదాచారం (ప్రవర్తన) పాటించాలి. మంచి బుద్ధి, మంత్ర తంత్రాల (పాఠ్యాంశాలుగా చెప్పుకోవచ్చు) పై చక్కని అభినివేశం ఉండాలి. నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి.
*ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు పార్వతికి చెబుతాడు. ప్రస్తుత సమాజానికి నిజంగా కావాల్సిన గురువు ఇలాంటి గురువులే.🙏
No comments:
Post a Comment