Fake emotions in society : ఇలాంటి ప్రేమ ఎందుకు? Rayala Suneetha
Author Name:Rayala Suneetha
Youtube Channel Url:https://www.youtube.com/@rayalasuneetha-w5b6g
Youtube Video URL:https://www.youtube.com/watch?v=m1A9DQY91wA
Transcript:
(00:00) హాయ్ ఇది మీకు తెలుసా? మొన్న నా వీడియోస్ చూసే ఒక ఆత్మీయుడు నన్ను కలిసి ఒక మాట అన్నాడు. అక్క ఈ రోజుల్లో మనుషులు బతుకున్నప్పుడు ఎలా చూస్తున్నారో ఏమో కానీ చనిపోయాక మాత్రం విపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు. దీని మీద ఒక వీడియో చేయండి అని అడిగాడు. తను అన్న మాట అక్షరాలా నిజం. ఈ మధ్యకాలంలో సమాజంలో ఒక వింత ట్రెండ్ నడుస్తోంది.
(00:30) మనుషులు బతికున్నప్పుడు వాళ్ళను అస్సలు పట్టించుకోరు. కనీసం బాగున్నావా అని ఫోన్ చేసి కూడా అడగరు. అదే కాదు కనీసం వాళ్ళ ఆరోగ్యం బాగోకపోయినా ఎలా ఉన్నారు ఏంటి అని అడగరు. కానీ వాళ్ళు చనిపోయాక మాత్రం ఫోటోల ముందు కూర్చొని ఏడ్చినట్టు నటించటం ఫోటోలకు దండేయటం ఆ ఫోటోలో ఉన్న మనిషికి నాకు ఎంత బాండింగో అని చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం సమాజం ముందు బిల్డప్ ఇవ్వటం ఇవన్నీ ఎక్కువైపోయాయి.
(01:06) అసలు ఈ నాటకాలు ఎవరికోసం ఒక్కటి ఆలోచించండి. మనిషి ప్రాణంతో ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించడానికి మనకు సమయం ఉండదు. సమయం ఉన్నా పలకరించాలని ఆలోచనే ఉండదు. ఆలోచన కూడా కాదు మినిమం ఎథిక్స్ ఉండవు. వాళ్ళకు ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి చేతులు రావు. కళ్ళ ముందే మనిషి కనిపిస్తున్నప్పుడు లేని ప్రేమ లేని గౌరవం ఆ మనిషి శ్వాస ఆగిపోయాక ఫోటోగా మారాక చూపిస్తే ఏం లాభం సారీ చూపించినట్టు నటిస్తే ఎవడికోసం నువ్వు ఏడుస్తున్నావని నీ కన్నీళ్లు తుడుస్తాడా లేదు కదా బతికున్నప్పుడు ఒక
(01:53) పూట ముద్ద పెట్టనివాడు చనిపోయాక పిండాలు పెడితే దండాలు పెడితే ఆకలి తీరుతుందా మనకు ఎవరి మీదైనా నిజంగా ప్రేమ ఉంటే అది వాళ్ళు బతికున్నప్పుడే చూపించండి. వాళ్ళతో నాలుగు మంచి మాటలు మాట్లాడండి. వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుండండి. అంతేకానీ బతికున్నంత కాలం ఏడిపించి చనిపోయాక ఫోటోల ముందు కూర్చొని కన్నీరు కార్చినట్టు యాక్టింగ్ చేయడం ఎవరికీ ఉపయోగం? అది కేవలం లోకాన్ని మోసం చేయడానికి వేసే బేషాలు మాత్రమే అవుతాయి.
(02:31) డ్రామాలు చేయడం ఆపండి మనుషుల విలువ వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నప్పుడే గుర్తించండి. చనిపోయాక పేజీలు పేజీలు రాసేకంటే బతికున్నప్పుడు పక్కన కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడండి చాలు మనిషి వెళ్ళిపోయాక ఏడ్చే ఏడుపు కంటే మనిషి ఉన్నప్పుడు ఇచ్చే తోడే గొప్పది. బంధాలను బతికున్నప్పుడే గౌరవించండి.
No comments:
Post a Comment