Sunday, July 26, 2026

Lover's Career vs Marriage : లవ్ చేసినప్పుడు లేని కండిషన్స్ పెళ్లికాగానే ఎందుకు? Rayala Suneetha

Lover's Career vs Marriage : లవ్ చేసినప్పుడు లేని కండిషన్స్ పెళ్లికాగానే ఎందుకు? Rayala Suneetha

Author Name:Rayala Suneetha

Youtube Channel Url:https://www.youtube.com/@rayalasuneetha-w5b6g

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8xuGURSgDoo



Transcript:
(00:00) హాయ్ ఇది మీకు తెలుసా ఈరోజు సమాజంలో చాలామంది ప్రేమికులు ఎదుర్కొంటున్న ఒక విచిత్రమైన నిజంగా ఆలోచించాల్సిన సమస్య గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక జంట సిన్సియర్ గా లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకునే రోజుల్లో అమ్మాయి ఉద్యోగం చేస్తుంటుంది. ఒకానొక దశలో అబ్బాయికి జాబ్ లేకపోయినా అమ్మాయే జాబ్ చేస్తూ సపోర్ట్ ఇస్తుంది. అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తనని కెరీర్ లో ఎంకరేజ్ చేస్తాడు. అంతా బానే ఉంటుంది.
(00:38) కానీ ఎప్పుడైతే పెళ్లి ప్రస్తావన వస్తుందో అప్పటివరకు ఎంతో సపోర్ట్ చేసిన అదే అబ్బాయి ఒక్కసారిగా ప్లేట్ తిప్పేస్తాడు. నువ్వు ఇక జాబ్ చేయడానికి వీలు లేదు. ఇంట్లోనే ఉండి మా అమ్మ నాన్నలను చూసుకోవాలి అని కండిషన్ పెడతాడు. అమ్మ ఏమో నేను అత్తమామలను బాగా చూసుకుంటాను ఇంట్లో పనులన్నీ చేస్తాను. కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కాబట్టి జాబ్ కూడా చేస్తాను అంటుంది.
(01:16) కానీ అబ్బాయి అస్సలు ఒప్పుకోడు. దీంతో ఆ బంధం పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనే సందిగ్ధంలో పడిపోతుంది. అసలు నా ప్రశ్న ఏంటంటే పెళ్లి అనగానే అబ్బాయిల మనసు ఎందుకు మారిపోతుంది? అప్పటిదాకా అమ్మాయి జాబ్ ని ఆమె ఇన్కమ్ ను యక్సెప్ట్ చేసినవాడు పెళ్లి అనగానే అమ్మాయి జాబ్ చేయడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు నాకు తెలిసి దీని వెనక మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
(01:48) ఒకటి యజమాని పొససివ్నెస్ అండ్ కంట్రోల్ అనే భావన. ప్రేమించేటప్పుడు ఇద్దరూ సమానంగా ఉంటారు. కానీ మన సమాజంలో పెళ్లి అనగానే అబ్బాయి మనసులోకి తెలియకుండానే నేను మొగుడిని నేను చెప్పినట్టు తను వినాలి అనే ఒక కంట్రోలింగ్ మైండ్సెట్ వచ్చేస్తుంది. లవర్ గా ఉన్నప్పుడు స్వేచ్ఛనిచ్చినవాడే భర్త కాబోయేసరికి తన ఆధీనంలో ఉంచుకోవాలి అనుకుంటాడు.
(02:22) రెండు సమాజం ఏమనుకుంటుంది? భార్య సంపాదన మీద బతుకుతున్నాడు లేదా భార్యను బయటకు పంపి సంపాదింప చేస్తున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ కామెంట్ చేస్తారో అని మగ అహంకారం ఇక్కడ అడ్డం వస్తుంది. భార్య కెరీర్ కంటే తన పరువు తన ఈగోనే అబ్బాయికి ముఖ్యమైపోతాయి. మూడు బాధ్యతలను కేవలం అమ్మాయికే పరిమితం చేయడం అమ్మ నాన్నలను చూసుకోవడం అనేది కేవలం కొడుకు బాధ్యత మాత్రమే కాదు కోడలికి కూడా బాధ్యత ఉంటుంది.
(03:00) కానీ ఆ నెపంతో అమ్మాయి ఐడెంటిటీని తన చదువుని తన కలలను నాలుగు గోడలకే పరిమితం చేయడం ఎంతవరకు న్యాయం తను అన్ని మేనేజ్ చేస్తానని చెబుతున్నప్పుడు కూడా నమ్మకపోవడం వెనక ఉన్నది భయం కాదు అపనమ్మకం ఒక్కటి ఆలోచించండి అబ్బాయిలు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అదే అమ్మాయి ఉద్యోగం చేస్తూ మీకు తోడుగా నిలబడింది అప్పుడు లేని పద్ధతులు అప్పుడు లేని సంప్రదాయాలు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాను అనేసరికి పెళ్లి పీటలు ఎక్కేసరికి గుర్తొచ్చాయా అమ్మాయిల చదువు వాళ్ళ ఉద్యోగం అనేది కేవలం డబ్బు కోసమే కాదు ఈ సమాజంలో వాళ్ళకంటూ ఒక
(03:47) గుర్తింపు కోసం రేపు ఏదైనా కష్టం వస్తే కాలేజీ చదివిన చదువు తన కాళ్ళ మీద తను నిలబడటానికి ధైర్యాన్ని ఇస్తుందనే నమ నమ్మకం కోసం అలాంటి నమ్మకాన్ని పెళ్లి పేరుతో ఎందుకు లాగేసుకోవాలని అనుకుంటున్నారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ ఇంటికి తెచ్చుకోవడం అంటే తన రెక్కలు కత్తిరించి పంజరంలో పెట్టడం కాదు తన కలలకు తోడుగా నిలబడటం బంధం అనేది ఒకరినొకరు అర్థం చేసుకొని సపోర్ట్ చేసుకోవడంలో ఉంటుంది కానీ ఒకరి కెరీర్ ని నాశనం చేసి ఇంట్లో కూర్చోబెట్టడంలో ఉండదు ఉద్యోగం చేసే అమ్మాయిలను పెళ్లి చేసుకోబోయే ముందు వాళ్ళ ఐడెంటిటీని కూడా
(04:33) గౌరవించడం నేర్చుకోండి. అప్పుడే ఆ కాపురం సంతోషంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయా లేదా మీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా షేర్ చేయండి.

No comments:

Post a Comment