Sunday, July 26, 2026

ఆఖరికి నీ పెళ్లి కూడా నీ వ్యక్తిగత విషయం కాకపోతే, ఇక జీవితంలో ఏది నీ వ్యక్తిగతం? | PRATIKULA VEDAM

ఆఖరికి నీ పెళ్లి కూడా నీ వ్యక్తిగత విషయం కాకపోతే, ఇక జీవితంలో ఏది నీ వ్యక్తిగతం? | PRATIKULA VEDAM

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=T1E-UQS0BGw



Transcript:
(00:00) ఈ మధ్య YouTube లో ఒక బాగా పేరొందిన ప్రముఖ ప్రవచనకర్త ఒకతను పెళ్లి ఎవరు నిర్ణయించాలో చెప్తుంటే విన్నాను. అతను చెప్పే మాటలపై నాకు చాలా గౌరవం ఉంది కాబట్టే విన్నాను. కానీ పెళ్లి అనే వ్యక్తిగత విషయంలో మాత్రం అతను చెప్పింది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇంతకీ అతను ఏం చెప్పారంటే పెళ్లి వ్యక్తిగత విషయము కాదు కాదు కాదు నీ సొంత వ్యవహారం కాదది.
(00:25) పెళ్లి అనేది నీ వ్యక్తిగత వ్యవహారం కాదు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు పెళ్లి చేసుకుంటే తండ్రికి గుండుపోటు వచ్చేస్తదట తల్లి సిగ్గుతో ఏడిచేస్తదట అక్క చెల్లెళ్ల పెళ్లిళ్లుు ఆగిపోతాయట నీకు భార్య ఎవరవ్వాలో భర్త ఎవరవ్వాలో నిర్ణయించాల్సింది తండ్రి మాత్రమే అని చెప్తూ పోనీ అంతటితో ఊరుకున్నారా లేదు అతను చెప్పిందే నిజం అని నమ్మించడానికి రిఫరెన్స్ గా ఇది ఏకంగా రామాయణం చెప్పిన తీర్పు అని అంటున్నారు.
(00:51) ప్రవచనాల్లో ముఖ్యంగా ఇలాంటి మాటలు ఎందుకు స్ప్రెడ్ చేస్తారో తెలుసా సమాజంలో ఉన్న చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని సమర్ధించుకోవడానికి మన ధర్మశాస్త్రాలను పురాణాలను వాళ్ళకు అనుకూలంగా వాడుకోవడానికి కానీ అసలైన సనాతన ధర్మంలో మనిషికి ఉండాల్సిన స్వయం నిర్ణయాధికారం అంటే ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ గురించి ప్రేమ గురించి ఏం చెప్పుందో మన పురాణాల్లో ఉన్న ఫాక్ట్స్ తోనే లాజికల్ గా అనలైజ్ చేద్దాం.
(01:18) పాయింట్ నెంబర్ వన్ నువ్వు తండ్రి చెప్పిన మాటని కాదని పెళ్లి చేసుకుంటే తండ్రి పరువు పోయి గుండెపోటు వచ్చేస్తది అన్నారు. నిజమే కానీ ఆ గుండుపోటు వెనకాల ఉన్నది అహంకారం అని ఎందుకు చెప్పట్లేదు దానికి మన పురాణంలో పర్ఫెక్ట్ ఉదాహరణ దక్షుడు సతీదేవి తన తండ్రి అయిన దక్షుడి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటది.
(01:42) దక్షుడు అంటే సాక్షాత్ు ప్రజాపతి అంతులేని అధికారంతో ఉన్నవాడు. తన కంట్రోల్ దాటి తన కూతురు తనకి ఏ మాత్రం నచ్చని స్మశానాల్లో తిరిగే శివుడిని పెళ్లి చేసుకుంది అన్నదే అతని కోపం అక్కడ దక్షుడికి వచ్చింది కూతురి మీద ప్రేమ కాదు నా కూతురు నా మాట వినలేదు అనే అహంకారం ఆ పరువు పోయిందని ఈగో తోటే శివుడిని అవమానించాడు. చివరికి సతీదేవి ప్రాణ త్యాగం చేసే పరిస్థితి తెచ్చాడు.
(02:06) ఈరోజు సమాజంలో కులం తక్కువ వాడిని చేసుకుంటే పరువు పోతుంది అని పరువు హత్యలు చేస్తున్న వాళ్ళకి ఆనాడు దక్షుడికి ఏమన్నా తేడా ఉందా? ఆ తండ్రికి తన అహంకారం మీద ఉన్న ప్రేమ సొంత పరువు మీద ఉన్న ప్రేమ ఒక బిడ్డ జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉందా సో తండ్రికి వచ్చే ఆ గుండెపోటు ప్రేమ వల్ల వచ్చేది కాదు దక్షుడి లాగే ఈగో దెబ్బ తినడం వల్ల వచ్చేది అని మన పురాణాలే ఘోషిస్తున్నాయి.
(02:34) పాయింట్ నెంబర్ టూ నీ భార్య లేదా భర్త ఎవరో నిర్ణయించేది తండ్రి మాత్రమే అనే స్టేట్మెంట్ అబద్ధం అని ప్రూవ్ చేయాలంటే మనం రుక్మిణి కళ్యాణం దగ్గరికి వెళ్ళాలి. రుక్మిణికి భీష్మకుడు అనే తండ్రి రుక్మి అనే అన్నయ్య ఉండేవారు. వీళ్ళిద్దరూ కలిసి రుక్మిణికి శిశుపాలుడితో వివాహం నిర్ణయించారు. అంటే ఒక తండ్రి ఒక అన్న కలిసి కూతురికి పెళ్లి ఎవరితో జరగాలో నిర్ణయించారు.
(02:58) మరి అప్పుడు రుక్మిణి ఏం చేసింది నాన్నగారు నిర్ణయించారు మరి నాన్నగారు నిర్ణయించిన సంబంధం కాబట్టి వాళ్ళకి ఎదురు చెబితే మరి నాన్నగారికి గుండుపోటు వచ్చేస్తది అని ఒక త్యాగం ఇలాగ సైలెంట్ అయిపోయిందా లేదు కృష్ణుడికి సందేశం పంపింది. తండ్రి నిర్ణయాన్ని కుటుంబ పరువుని పక్కన పెట్టి తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకుంది. మరి కృష్ణుడు ఏం చేశడు నీ తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించు లేకపోతే అతనికి గుండుపోటు వచ్చేస్తది పెద్దన మాటకు ఎదురు చెప్పడం ధర్మం కాదు అని అన్నాడా లేదు ఆమె వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి రుక్మిణిని తీసుకెళ్ళిపోయాడు. మరి తండ్రి
(03:29) మాటే ఫైనల్ అవ్వాలి అనేదే ధర్మం అయితే కృష్ణుడు చేసింది అధర్మమా ఇది ఆ ప్రవచనకర్తలే చెప్పాలి మరి. ఒక మనిషికి తన మనసుకి ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేయడం అధర్మం దాన్ని ఎదిరించడమే ధర్మం అని కృష్ణుడు ప్రాక్టికల్ గా చూపించాడు. ఇక పాయింట్ నెంబర్ త్రీ మహాభారతంలో ఇంకో అద్భుతమైన ఘట్టం ఉంటుంది. బలరాముడు తన చెల్లెల సుభద్రుని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు.
(03:54) ఇక్కడ బలరాముడు తండ్రి స్థానంలో ఉన్న అన్న. కానీ సుభద్ర మనసులో అర్జునుడు ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఒక మైండ్ బ్లోయింగ్ మాట చెప్తాడు. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూతురి స్థానంలో ఉన్న క్షత్రియకాంతను ఒక పశువులాగా ఒక ఆస్తిలాగా ఎవడికో ఒకడికి దానం చేయడం ధర్మం కాదు ఆమె మనసు ఎవరిని ఇష్టపడుతుందో వాళ్ళను చేపట్టడమే అసలైన ధర్మం అని చెప్పి సుభద్రని ఎత్తుకుపోమని స్వయంగా శ్రీకృష్ణుడే సలహా ఇస్తాడు.
(04:21) దీని అర్థం ఏంటి? ఒక అమ్మాయిని గాని అబ్బాయిని గాని వాళ్ళ ఇష్టంతో సంబంధం లేకుండా కేవలం పెద్దవాళ్ళు కుదిర్చారు అనే ఒకే ఒక కారణంతో పెళ్లి పెట్టల మీద కూర్చోబెట్టడాన్ని కృష్ణ పరమాత్మ ఏనాడో వ్యతిరేకించాడు. పెళ్లి అనేది రెండు ప్రాపర్టీల మధ్య జరిగే ట్రాన్సాక్షన్ కాదు రెండు మనసుల మధ్య జరగాల్సిన యూనియన్ అని క్లియర్ గా చెప్పాడు.
(04:42) ఇక పాయింట్ నెంబర్ ఫోర్ మనం పతివ్రత అనగానే ముందుగా చెప్పుకునే పేరు సతి సావిత్రి అసలు సావిత్రి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా ఆమె తండ్రి అశ్వపతి ఆమెతో ఏమన్నాడంటే అమ్మ నీకు నచ్చిన భర్తని నువ్వే వెతుక్కో అని దేశాటనగా పంపాడు. ఆమె స్వయంగా అడవిలో ఉన్న సత్యవంతుడిని చూసి ఇష్టపడింది. కానీ అతను ఒక సంవత్సరంలో చనిపోతాడు అని నారదుడు చెప్పగానే తండ్రి భయపడి వద్దు తల్లి వేరేవాడిని చూసుకో అన్నాడు.
(05:08) అప్పుడు సావిత్రి ఏమందో తెలుసా నా మనసు అతన్ని భరించింది నా నిర్ణయం మారదు అని అంది. ఇక్కడ తండ్రి తన కూతురి ఛాయిస్ ని గౌరవించాడు. ప్రాణం పోతుందని తెలిసిన ఆమె స్వేచ్ఛని అడ్డుకోలేదు. బ్లాక్ మెయిల్ చేయలేదు. అది ఒక తండ్రికి ఉండాల్సిన నిజమైన మెచూరిటీ. ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ మన పురాణంలో ఎక్కడ చూసినా స్వయంవరం అనే పదం కనిపిస్తుంది.
(05:32) స్వయంవరం అంటే తనకు కావలసిన వాడిని తానే ఎంచుకోవడం. సీతాదేవైనా ద్రౌపది అయినా దమయంత అయినా ఒక కండిషన్ పెట్టి దాన్ని సాధించిన వాడిని వాళ్లే వరించారు తప్ప తండ్రి ఎవరో ఒకరిని తీసుకొచ్చి బలవంతంగా పీటల మీద కూర్చోబెట్టలేదుగా దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అసలు సనాతన ధర్మం అనేది ఎప్పుడూ మనిషిని బానిసగా చూడలేదు మనిషి యొక్క స్వేచ్ఛను ప్రేమను ఇండివిడ్యువల్ గా ఉండే ఎరుకని మన ఇతిహాసాలు ఎంతగానో సెలబ్రేట్ చేశయి గౌరవించాయి.
(06:02) అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే కాలక్రమంలో మన సమాజం స్వార్థంతో కూరుకుపోయి కులము, మతము, ఆస్తి, పరువు అనే చట్రంలో ఇరుక్కుపోయింది. ఆ ఆస్తులను పరువును కాపాడుకోవడానికే ఒకే కులాల మధ్య పెళ్లిలు కుదర్చడం మొదలు పెట్టారు. దాన్ని జస్టిఫై చేసుకోవడానికి మన పురాణాలను వాళ్ళకు నచ్చినట్లుగా వక్రీకరించి కట్ చేసి ఇదిగో చూసారా రామాయణంలో రాముడు ఏం చెప్పాడో కాబట్టి తండ్రి మాటే ఫైనల్ అని బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు.
(06:27) తండ్రికి పిల్లల పట్ల ఒక బాధ్యత ఉంటది. అయితే అది వాళ్ళకి ఏది మంచో ఏది చెడో చెప్పడం వరకు మాత్రమే వాళ్ళకు లైఫ్ టూల్స్ ని ఇవ్వడం వరకు మాత్రమే అంతేగాని నీ జీవితాన్ని డ్రైవ్ చేసే స్టీరింగ్ నా చేతిలోనే ఉంటది అని అనడం పితృస్వామ్య ఆధిపత్యం సంప్రదాయం ధర్మం పేరుతో ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ని పితృస్వామి ఆధిపత్యాన్ని సమర్ధిస్తూ ప్రవచనకర్తల పొజిషన్ లో ఉన్నోళ్లే ఇలా మాట్లాడితే సాధారణంగా ఇవన్నీ వింటున్న తల్లిదండ్రులు అదే నిజమైన ధర్మం కావాలా అనుకొని తమ పిల్లలకు ఉండే స్వేచ్ఛని మరింత కాలరాశ ప్రమాదం ఉంది. ఇదిగో చూసావా ఆ ప్రవచనకర్త
(07:01) గారే ఇలా చెప్పారు కాబట్టి నేను నా పిల్లలకు ఉండే ఇష్టాన్ని చంపేసిన తప్పులేదు నేను వాళ్ళని కంట్రోల్ చేయడమే నా ధర్మం అని వాళ్ళ అహంకారానికి మనమే ఒక లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. నాయకులైనా ప్రవచనకర్తలైనా సమాజాన్ని జాగృతం చేయాలి గానీ పాతబడిపోయిన సామాజిక భయాలను కుటుంబ పరువు అనే భ్రమలను మళ్ళీ మళ్ళీ నూరిపోయకూడదు. ఇక్కడ నా ఉద్దేశం ఆ ప్రవచనకర్తలని విమర్శించడం కాదు.
(07:29) వాళ్ళ మాటల్లో దాగి ఉన్న ఆ సోషల్ కండిషనింగ్ ని ప్రశ్నించడం మాత్రమే ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మికత అంటే భయపెట్టడం కాదు ఒక మనిషి ఆలోచనలకు ఉండే సంఖ్యలు తెంచి అవగాహనతో కూడిన స్వేచ్ఛనిఇవ్వడం భయాన్ని నూరుపోసే ఏ ఫిలాసఫీ అయినా సరే అది సమాజాన్ని వెనక్కి లాగుతుందే తప్ప ముందుకి తీసుకు వెళ్ళదు. మనిషి మెదడుకి కావలసిందే గుడ్డి నమ్మకం కాదు నిలదీసే వివేకం

No comments:

Post a Comment