Sunday, July 26, 2026

బంధాలు భారమని పారిపోవడం జ్ఞానం కాదు. పచ్చి పిరికితనం | DIOGENES DOG STORY || Anukula Vedam

బంధాలు భారమని పారిపోవడం జ్ఞానం కాదు. పచ్చి పిరికితనం | DIOGENES DOG STORY || Anukula Vedam

Author Name:Anukula Vedam

Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=b_WT5V1KUnU



Transcript:
(00:00) అబ్బబ్బబ్బబ్బా ఈ బంధాలు బాధలు రేపు ఏమైపోద్దో అనే ఆలోచనలు ఇవేమి లేని ఆ కుక్కను చూడండి ఎంత హాయిగా ప్రశాంతంగా బ్రతికేస్తుందో కదా సో మీరు కూడా ఆ కుక్కలు బ్రతికిస్తే పోలా అంటే అన్నాడు గనీ ఆ ఊహ ఎంత బాగుందో అనిపిస్తుందా నిజమే ఇలాంటి మాటలు మనకి భలే కన్వీనియంట్ గా అనిపిస్తాయి. కానీ ఎందుకో తెలుసా ఎందుకంటే ఇందులో బాధ్యత రిస్క్ ఈ రెండు ఉండవు కాబట్టి తమ లోపల ఉన్న భయానికి దేనిని నిలబెట్టుకోలేని తమ చేతగానితనానికి ఫిలాసఫీ అనే అద్భుతమైన మేకప్ వేస్తారు చాలామంది డయాజినిస్ అనే గ్రీకు తత్వవేత్త ఒకతను ఉండేవాడు. అతని గురించి మనం ఇక్కడ
(00:40) కాస్త మాట్లాడుకోవాలి. డయాజినిస్ సమాజాన్ని ఆస్తుల్ని అన్ని వదిలేసి ఒక సిమెంట్ కుండీలో బ్రతుకుతుండేవాడు. అతని దగ్గర నాస్తల ఒంటి మీద ఒక బట్ట చేతిలో ఒక కర్ర నీళ్లు తాగడానికి ఒక కొబ్బరి చెప్పలాంటి గిన్నె నాకు దీని మీద వ్యామోహం లేదు నేను అన్ని వదిలేసిన ఒక సన్యాసిని అనే టైపులో ఉండేవాడు. ఒకరోజు అతను నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్ళాడు.
(01:02) అక్కడ ఒక కుక్క ఎలాంటి గిన్నె లేకుండా డైరెక్ట్ గా నదిలో మూతి పెట్టి నీళ్లుు తాగడం చూశాడు. అది చూడగానే మన డైజనస్ గారికి డింగుమని జ్ఞానోదయం అయిపోయి అరెరేరే ఈ కుక్కకుఉన్న వైరాగ్యం కూడా నాకు లేదు కదా ఈ గిన్నెని మోయడం కూడా ఒక భారమే కదా ఇది కూడా ఒక బంధమే కదా అని ఫీల్ అయిపోయి వెంటనే తన చేతిలో ఉన్న ఆ కొబ్బరి చిప్పలాంటి గిన్నెని నేలకేసి కొట్టి ముక్కలు చేసి ఇక అప్పటి నుంచి ఆ కుక్కనే తన ఆదర్శంగా మార్చుకున్నాడు.
(01:31) ఇది కథ వినడానికి భలే అనిపించింది కదా అబ్బబ్బా ఎంత వైరాగ్యం ఎంత గొప్ప త్యాగం అనిపిస్తుంది కదా కానీ ఒక్కసారి కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించండి ఆ కుక్క నీళ్లు తాగడానికి ఆ గిన్నెని ఎందుకు వాడదు దానికి ఏమైనా జీవితం మీద విరక్తి పుట్టిందా దానికి సన్యాసం మీద ఆసక్తి పుట్టిందా కాదు గిన్నెను తయారు చేసుకునే బుర్ర ఆ కుక్కకి లేదు కాబట్టి జంతువు స్థాయి నుండి మనిషి పైకి ఎదిగిందే ఆ గిన్నెని తయారు చేసుకోవడం వల్లే ఆ గిన్నె కేవలం ఒక మట్టి పాత్ర కాదు అది మనిషిలో లో జరిగిన ఒక పరిణామం అది ఒక ప్రయాణం నా దగ్గర గిన్నె ఉండే అది పగిలిపోద్దేమో అనే
(02:05) భయంతో దాన్ని ఎక్కడ శుభ్రం చేయాలో అనే బద్ధకంతో అబ్బే నాకు అసలు గిన్నే వద్దు నేను డైరెక్ట్ గా నీళ్ళని కుక్కలా తాగుతా అని అనడం వైరాగ్యం కాదు అది పచ్చి పలాయిన వాదం ఎస్కేపిజం పగిలిపోతుందని పాత్రను పారేసేవాడు విరిగిపోతుందని విళ్ళని వదిలేసేవాడు వేదాంతి కాదు వట్టి పిరికివాడు ఇది ఎలాంటిది అంటే నీ శరీరంలో ఉన్న కాళ్ళు నడిస్తే విరిగిపోతాయేమో అని ఈ వాల్టి నుండి నడవడం మానేస్తావా అలాగే బంధం ఎక్కడ తెగిపోతుందో అని భయపడి అసలు బంధమే వద్దు అనుకోవడం అనేది మన పిరికితనానికి మనం ఇచ్చుకునే ఒక ఎలివేషన్ ఒక ఫోన్ ఉంటే అది పగిలిపోతుందేమో అని దాన్ని
(02:42) కొనుక్కోకుండా ఉంటామా అడవిలోకి పారిపోయి చీకటి గదుల్లో కూర్చుంటే నువ్వు ఫిలాసఫర్ వి కావు జీవితాన్ని ఫేస్ చేసే దమ్ము లేని ఒక ఫెయిల్యూర్ఫి బుద్ధుడు ఏం చెప్పాడంటే నువ్వు ఒక తేనటేగలా బ్రతుకు అని అంటే మకరందం తీసుకునే ప్రక్రియలో భాగంగా ఒక తేనటీగ ఒక పువ్వు దగ్గరే అతుక్కపోకుండా అన్ని పువ్వుల దగ్గరికి వెళ్తూ సేకరిస్తది.
(03:06) అంటే బుద్ధుడు ఈ మాట ఏ ఉద్దేశంతో చెప్పాడు నువ్వు దేనికి అటాచ్ అయిపోయి అక్కడే ఉండిపోకు అని ఈ మాటని సర్వం వదిలేసిన భిక్షవులకు చెప్తే ఒక అర్థం ఉంది. కానీ నేటి సమాజంలో మన సంబంధాలకు దీన్ని అప్లై చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అది అల్టిమేట్ స్వార్థం అవుతుంది. ఇప్పుడు అందరూ తేనటేగలాగా మారిపోయి అవసరం తీర్చుకొని ఎగిరిపోవడమే ఫిలాసఫీ అని అనుకుంటే అసలు స్థిరంగా నిలబడి మకరాందాన్ని ఇచ్చే పువ్వులు ఎక్కడ ఉంటాయి అసలు బంధం అంటే ఏంటి నీకు అవసరం వచ్చినప్పుడు వాడుకొని వదిలేయడానికి అదేమనా పబ్లిక్ వైఫ్ అయ్యా ఒకరికొకరు తోడుగా నిలబడటం వేరు ఒక ఎమోషనల్ పేరైసేట్లా ఒకరిని వాడేసుకొని ఎగిరిపోవడం
(03:41) వేరు బంధం అంటే కమిట్మెంట్ అది అవసరం తీరిపోగానే క్లియర్ చేసుకునే బ్రౌసింగ్ హిస్టరీ కాదు ఈ తేనటేగ ఫిలాసఫీ అనేది కష్టం రాగానే ఎస్కేప్ అయిపోవాలనుకునే వాళ్ళకు దొరికిన ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అసలు ఈ కుక్క తేనటికి ఫిలాసఫీల వెనక ఉన్న అసలైన జబ్బు ఏంటో తెలుసా నేను చిన్న బాధని కూడా భరించలేను అన్న ఒకే ఒక భయం అవును బంధం ఉన్న దగ్గరే బాధ కూడా ఉంటుంది.
(04:08) ఎందుకంటే జీవితంలో దేనికైనా సరే ఒక ఆపర్చునిటీ కాస్ట్ ఉంటది. నువ్వు ఒకరిని డీప్ గా ప్రేమిస్తున్నావు ఒకరి మీద నీ ఎమోషన్స్ ని పెట్టుబడి పెడుతున్నావు అంటే రేపు వాళ్ళు దూరమైతే వచ్చే గుండె కోతను నువ్వు ఈరోజే అడ్వాన్స్ గా అంగీకరిస్తున్నట్టే అలా అంగీకరిస్తూ కూడా దానికి రెడీ అయి బ్రతకడమే మనిషిగా బ్రతకడం అంటే అమ్మో నాకు నొప్పి వద్దు కన్నీళ్లు వద్దు అని అనుకుంటే నువ్వు అసలు మనిషిలా బ్రతకాల్సిన అవసరమే లేదు ఒక బండరాయిలా మారిపో దానికి ఏడుపు రాదు గుండె కూడా పగలదు ఎందుకంటే దానికి అసలు ప్రాణమే లేదు సమస్యల నుండి బాధల నుండి తప్పించుకొని తిరగడం జ్ఞానం
(04:45) కాదు గాయం అవుతుందని యుద్ధం మానేసేవాడు సైనికుడు కాదు విరిగిపోతుందని విల్లు ఎక్కు పెట్టడం ఆపేసేవాడు విలుకాడు కాదు అలాగే పగిలిపోతుందేమో అని గిన్నెనే పారేసేవాడు అసలు మనిషే కాదు సో బ్రతికిన రోజులు కుక్కలా బ్రతుకుతావో మనిషిలా బ్రతుకుతావో నీ ఇష్టం

No comments:

Post a Comment