The Illusion of Psychological Time — Jiddu Krishnamurti #jiddukrishnamurti #jiddimotivation #jiddu
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wNRZMvYobs0
Transcript:
(00:07) మీరు ఒకసారి మోసపోయారు అనుకోండి ఆ సంఘటన ఒక్క క్షణంలో ముగిసిపోతుంది. కానీ మీ మనసు మాత్రం ఆ మోసాన్ని రోజుల తరబడి మోస్తూనే ఉంటుంది. అదే కృష్ణమూర్తి చెప్పిన సైకలాజికల్ టైం [సంగీతం] అంటే మనసు సృష్టించే కాలం. నిజానికి ఆ సంఘటన ఎప్పుడో ముగిసిపోయింది. [సంగీతం] కానీ మీ ఆలోచనల్లో అది ఇంకా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఎవరైనా మోసం చేస్తారేమో అని భయపడతారు.
(00:31) ఎవరు మోసం చేశారో వారిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ బాధపడతారు. కానీ నిజం ఏమిటంటే ఆ గతం ఇప్పుడు లేదు. కృష్ణమూర్తి తన ప్రసంగాల్లో ఒక ఉదాహరణను తరచుగా చెప్పేవారు. ఒక మనిషి రోడ్డుపై నడుస్తున్నాడు అనుకోండి అతని కళ్ళ ముందు ఆకాశం ఉంది. చెట్లు ఉన్నాయి. [సంగీతం] కానీ అతని మనసు మాత్రం అక్కడ లేదు. రేపు ఆఫీస్ లో ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాడు. నిన్న ఇంట్లో జరిగిన గొడవను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు.
(00:54) [సంగీతం] అతని శరీరం రోడ్డుపై నడుస్తోంది. కానీ అతని మనసు గతానికి భవిష్యత్తుకి మధ్య తిరుగుతోంది. అప్పుడు కృష్ణమూర్తి ఒక ప్రశ్న అడిగేవారు. ఈ మనిషి నిజంగా జీవిస్తున్నాడా? లేక తన ఆలోచనల్లోనే జీవిస్తున్నాడా? [సంగీతం] నిజానికి మనలో చాలా మంది కూడా ఇలాగే జీవిస్తున్నారు. శరీరం ఈ క్షణంలో ఉంటుంది. [సంగీతం] కానీ మనసు మాత్రం గతంలో లేదా ఇంకా రాని భవిష్యత్తులో ఉంటుంది.
(01:16) కృష్ణమూర్తి ప్రకారం మనిషి [సంగీతం] బాధకు మూల కారణం ఆలోచనే. ఈ బాధ నుంచి బయటపడాలని చాలా మంది ప్రయత్నిస్తారు. ఆలోచించకూడదు ఆలోచించకూడదు [సంగీతం] అని మనసును బలవంతం చేస్తారు. కానీ కృష్ణమూర్తి దీన్ని పూర్తిగా ఖండించారు. ఎందుకంటే ఆలోచనని ఆలోచన ఆపడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఇంకో ఆలోచన పుడుతుంది. ఇది ఒక కుక్క.
(01:42) తన తోకను తానే పట్టుకోవడానికి తిరిగే ఆట లాంటిది. [సంగీతం] ఎంత తిరిగినా తోక దొరకదు. ఎందుకంటే తోక తిరిగే కుక్కలో భాగమే. అలాగే. కృష్ణమూర్తి [సంగీతం] చెప్పిన అత్యంత లోతైన సత్యం ఇదే ఆలోచించేవాడు ఆలోచన వేరు వేరు కాదు [సంగీతం] ఇద్దరు ఒకటే కాబట్టి ఆలోచనతో పోరాడటం అంటే మీతో మీరు పోరాడటమే ఆ పోరాటం [సంగీతం] ముగియదు పైగా అదే మరిన్ని ఆలోచనలను మరింత బాధను సృష్టిస్తుంది.
(02:07) ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీకు ఒక ఇంటర్వ్యూ ఉందనుకోండి రాత్రంతా మీ మనసు ఒక్కటే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం అడుగుతారో అని ఇలాంటి సమయంలో కృష్ణమూర్తి చెప్పేది ఒక్కటే ఆ ఆలోచనను తోసిపుచ్చకండి [సంగీతం] ఆలోచించకూడదు అని మనసుతో పోరాడకండి దాని బదులు కేవలం గమనించండి నిశశబ్దంగా గమనించండి. ఆలోచన మీపై ఆధిపత్యం కోల్పోవడం ప్రారంభిస్తుంది.
(02:31) ఆ క్షణంలో మీకు ఒక గొప్ప విషయం అర్థమవుతుంది. మీరు ఆ ఆలోచనకు బానిస కాదు. మీరు [సంగీతం] ఆ ఆలోచనను గమనిస్తున్న వ్యక్తి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కువగా ఆలోచించడం మానేయడానికి ప్రయత్నించకండి మీరు ఆ ఆలోచనను గమనించడం మొదలు పెట్టండి. తీర్పు లేకుండా చూడండి పోరాటం లేకుండా చూడండి అప్పుడు ఆలోచన మీ మీద పట్టుకోపోతుంది.
(02:51) కృష్ణమూర్తి చెప్పిన సారాంశం ఇది ఒక్కటే మీరు మీ ఆలోచన కాదు మీరు ఆ ఆలోచనను చూసేవారు. ఈ [సంగీతం] ఒక్క సత్యం అర్థమైతే మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఓం
No comments:
Post a Comment